Almond Peels Benefits: నానబెట్టిన బాదం పొట్టు తినకుండా బయటపడేస్తున్నారా ?.. ఇలా ఉపయోగిస్తే ఎన్నో లాభాలు..

|

May 19, 2022 | 9:37 PM

నానబెట్టిన బాదం పప్పు తినడం వలన జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంటారు..

Almond Peels Benefits: నానబెట్టిన బాదం పొట్టు తినకుండా బయటపడేస్తున్నారా ?.. ఇలా ఉపయోగిస్తే ఎన్నో లాభాలు..
Almond Peel
Follow us on

ఆరోగ్యానికి అత్యంత ఆరోగ్యకరమైనవి బాదంపప్పులు. పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో బాదం పప్పు తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. (Almond) అయితే నానబెట్టిన బాదం పప్పు తినడం వలన జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంటారు.. అయితే చాలా మంది నానబెట్టిన బాదం తినే ముందు దాని తొక్కను తీసేస్తారు… బాదం తొక్కలను తొలగించి తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ మీకు తెలుసా.. బాదంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.. అలాగే చర్మానికి ఉయోగకరంగా ఉంటుంది.. అంతేకాకుండా బాదం తొక్కలతో అనేక లాభాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

బాదం తొక్కలను మొక్కలకు ఎరువుగా ఉపయోగించాలి.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్, ప్రీ బయోటిక్ లక్షణాలు మొక్కలలో మెటాబోలైట్స్, విటమిన్ ఇ మొత్తాన్ని పెంచడానికి పనిచేస్తాయి. అలాగే బాదం తొక్కల కంపోస్ట్ చేయడానికి ముందుగా వాటిని ఎండలో ఆరబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొక్కలకు వేయాలి.

బాదం తొక్కలను చట్నీ రూపంలో కూడా తీసుకోవచ్చు.. ఇందులో విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చట్నీ చేయడానికి బాదం తొక్కలను రాత్రంతా నానబెట్టాలి. ఇప్పుడు వేరు శనగలను వేయించి బాదం తొక్కలతో రుబ్బుకోవాలి.. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, శనగపప్పు, ఉల్లిపప్పు, ఎండుమిర్చి పొడి, జీలకర్ర వేసి కలిపి వేయించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో రుబ్బిన బాదం తొక్క, శనగపప్పు, ఉప్పు, చింతపండు రసం కలపాలి. ఆ చట్నీని ఆవాలు, కరివేపాకులతో అలంకరించి సర్వ్ చేయాలి.

ఇవి కూడా చదవండి

బాదం పొట్టుతో తయారైన బాడీ వాస్ యాంటీ ఏజింగ్ లక్షణాలతో చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ బాదం తొక్కలో 2 టీస్పూన్ల పాలు, ఒక టీస్పూన్ పసుపు, కొద్దిగా రోజ్ వాటర్, తేనె మిక్స్ చేసి 5 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాడి స్క్రబ్బర్ గా.. ఫేస్ ప్యాక్ గా అప్లై చేయాలి.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. అభిప్రాయాలు, ఇతర నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.