Banana Leave Benefits: అరిటాకులో భోజనం చేస్తున్నారా ? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

|

Sep 15, 2021 | 12:58 PM

పూర్వం సామాన్యుల నుంచి రాజుల వరకు అందరూ అరిటాకులలో భోజనం చేసేవారు. కంచంలో కాకుండా.. అరిటాకులలో భోజనం చేయడం

Banana Leave Benefits: అరిటాకులో భోజనం చేస్తున్నారా ? అయితే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..
Banana Leave
Follow us on

పూర్వం సామాన్యుల నుంచి రాజుల వరకు అందరూ అరిటాకులలో భోజనం చేసేవారు. కంచంలో కాకుండా.. అరిటాకులలో భోజనం చేయడం వలన ఆరోగ్యం ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని పెద్దలు చెబుతుండేవారు.ఇక మన భారతీయ సంప్రదాయంలో అరిటాకు భోజనం అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంటుంది. నేలపై కూర్చుని అరిటాకు భోజనం చేయడం వలన మంచిదని.. ఐశ్వర్యం కలుగుతుందని.. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని అంటుంటారు. కానీ ప్రస్తుత కాలంలో అరిటాకు భోజనం అనేది పేపర్స్ మీద పోస్టర్స్‏గా మారింది. అయితే ఇటీవల కొన్ని రెస్టారెంట్స్‏లలో అరిటాకు భోజనానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మీకు తెలుసా.. అరిటాకులలో భోజనం చేయడం వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మనం తీసుకునే ఆహారంతో జతకలిసి .. మనల్ని అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

1. అరిటాకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహయపడతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే వ్యాధులను నివారిస్తుంది.
2. అరిటాకులపై ఉండే పొర.. ఆహారపు రుచిని పెంచుతుంది. వేడి వేడి ఆహారాన్ని వడ్డించినప్పుడు ఆ పొర కరిగి… ఆహారంతో కలిసి రుచి పెరుగుతుంది.
3. మనం ప్లాస్టిక్, స్టీల్ లేదా ఇతర లోహపు పాత్రలలో తినేటప్పుడు, ఆహారంలో అనేక రసాయనాలు కలిసిపోతాయి. కానీ అరటి ఆకులపై తినేటప్పుడు, అలాంటి రసాయనాలు మన ఆహారంలో కనిపించవు.
4. ప్లాస్టిక్ పాత్రలలో తినే ఆహారం వలన మన శరీరంలోని రక్తం పెరుగుదలపై కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ అరిటాకులో భోజనం చేయడం వలన ఇతర వ్యాధులు తగ్గడమే కాకుండా.. రక్తం శుద్దిగా ఉంటుంది.
5. అరటి ఆకులో రోజూ భోజనం చేయడం వల్ల చాలా రకాల దీర్ఘాకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల తగ్గిపోతాయి.

Also Read: Pooja Hegde : సల్మాన్‌తో పూజాహెగ్డే సినిమా ఆగిపోయిందంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Goat Milk: లీటరు రూ.50 ఉండే మేకపాలు.. రూ.1500 పెట్టినా దొరకట్లేదు.. ఎందుకంటే…?