కరోనా మహమ్మారి వలన ఇప్పుడు ప్రజలంతా తమ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కోంటున్న సమస్యలలో థైరాయిడ్ ఒకటి. రోజులో ఎక్కువ సమయం అలసటగా అనిపించడం.. బరువు పెరగడం, చలి ఎక్కువగా అనిపించడం.. జుట్టు రాలయం వంటి సమస్యలు ఉంటే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ఎక్కువగా చెమట పట్టడం, భయంగా ఉండడం కూడా థైరాయిడ్ లక్షణాలే. శరీరంతోపాటు.. మనస్సును కూడా నియంత్రించే ఈ థైరాయిడ్ వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
శరీరంలో థైరాయిడ్ గ్రంథి పనితీరు ?
థైరాయిడ్ అనేది.. మెడ ముందుభాగంలో ఉండే గ్రంతి. ఇది జీవక్రియ వేగాన్ని నియత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడీ హార్మన్ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా జీవక్రియ నెమ్మదిస్తుంది. దీంతో హార్మోన్స్ చాలా తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి.
బరువు పెరగడం..
థైరాయిడ్ ప్రభావం వలన శరీరంలో అనేక మార్పులు సంభవిస్తుంటారు. ముఖ్యంగా బరువు పెరగడం. దీనినే హైపోథైరాయిడిజం అని పిలిచే థైరాయిడ్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం వలన శరీర బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. దీనిని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం అనేది సాధారణ సమస్య.
మెడలో వాపు..
మెడలో వాపు అనేది థైరాయిడి సమస్యలో ఒకటి. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజంతో గోయిటర్ సంభవిస్తుంది. కొన్నిసార్లు మెడలో వాపు అనేది థైరాయిడ్ లేదా క్యాన్సర్ లేదా నాడ్యూల్స్, థైరాయిడ్ లోపల పెరిగే గడ్డల వలన కూడా కావచ్చు. థైరాయిడ్ మాత్రమే కాకుండా.. ఇతర సమస్యల వలన ఇది సంభవిస్తుంది.
గుండె కొట్టుకోవడం వేగంలో మార్పు..
థైరాయిడ్ హార్మోన్లు శరీరాంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే గుండె వేగంపై కూడా ప్రభావం చూపిస్తాయి. హైపోథైరాయిడిజం ఉన్నవారికి సాధారణ హృదయ స్పందన రేటు కంటే నెమ్మదిగా ఉంటుంది. అదే సమయంలో హైపర్ థైరాయిడిజం కారణంగా గుండె కొట్టుకోవడం వేగంగా ఉంటుంది. ఇది పెరిగిన రక్తపోటు, గుండె లేదా దవడను కూడా ప్రేరేపిస్తుంది.
మానసిక స్థితిలో మార్పులు..
థైరాయిడ్ సమస్యలు మీ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తాయి. హైపోథైరాయిడిజం ఎక్కువగా అలసిపోయేలా, నీరసంగా, నిరాశగా ఉంటారు. హైపర్ థైరాయిడిజం ఆందోళన, నిద్రలో ఇబ్బంది, విరామం, చిరాకు కలిగిస్తుంది.
Also Read: Samantha: మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇలా చేయండి.. సమంత చెబుతోన్న ఫిట్‌నెస్ పాఠాలు ఏంటో చూడండి.