చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాస్త ఎక్కువ శ్రద్ద చూపించాల్సి ఉంటుంది. అలాగే ఈ సీజన్లో చర్మాన్ని .. జుట్టును కాపాడుకోవడం కూడా ముఖ్యమే. చలి నుంచి తట్టుకునేలా.. ఈ వింటర్ సీజన్లో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అందులో అన్ని సీజన్స్ కంటే చలికాలంలో తీసుకునే ఆహారంపై ఎక్కువగా శ్రద్ద పెట్టాలి. సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను నియంత్రిస్తుంది. అవెంటే తెలుసుకుందామా.
చలికాలంలో ఆహారంలో అల్లం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. అనేక ఔషధగుణాలు అల్లంలో ఉన్నాయి. దీంతోపాటు జీర్ణక్రియ సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ ఇది ఎక్కువగా పనిచేస్తుంది. అంతేకాదు.. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలోనూ అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
సిట్రస్ పండ్లు… రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడతాయి. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. నారింజ, ద్రాక్షపండు, కివీ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా వీటిని తీసుకోవాలి.
ఈ కాలంలో బీట్ రూట్ తీసుకోవడం వల్ అనేక ప్రయోజనాలున్నాయి. ఫోలేట్, పొటాషియం, బీటా కెరోటిన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడంలోనూ సహయపడతాయి. చర్మ సమస్యలు తగ్గుతాయి.
అవకాడోలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే చర్మం, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. ఒమేగా 3, విటమిన్ బి, బి6, ఇ, సి, కె, పాంటోథెనిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు ఇందులో ఉన్నాయి.
రోజుకు ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ కు దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడుతుంది. అలాగే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా.. యాపిల్ తొక్కలో ఎక్కువగా పీచు, ఫైటోన్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
Also Read: Varudu Kavalenu Twitter Review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ.. నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే..
Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..