ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు.. ఫిట్‌గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కొందరు జిమ్‌కు వెళ్లి వ్యాయమాలు చేస్తుంటే.. మరికొందరు నడక.. యోగా చేస్తూ శరీరాకృతిపై దృష్టి సారిస్తారు. అయితే రోజూ గోరువెచ్చని నీరు తాగేతే ఎన్నో ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. బరువు తగ్గడమే కాకుండా… ఇన్ఫెక్షన్స్, అనేక వ్యాధులను నియంత్రించడంలోనూ సహయపడుతుంది. అయితే గోరువెచ్చని నీటిని రోజు ఉదయాన్నే తాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియవు.. ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిని తాగితే కలిగే ప్రయోజనాలెంటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఆయుర్వేద రచయిత.. నిపుణుడు.. డాక్టర్ అబ్రార్ ముల్తానీ ప్రకారం ఫిట్‌గా ఉండటానికి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా.. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తాగడం వలన శరీరంలోని టాక్సిన్ బయటకు వెళ్లిపోతాయి. దీని వలన హిమోగ్లోబిన్ తగ్గడం.. ఎముకలు బలహీనపడడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.. ఛాతీలో శ్లేష్మం చేరడం వలన శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తాగడం ఈ సమస్య తగ్గుతుంది.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తాగడం వలన బరువు తగ్గుతారు. గోరువెచ్చని నీటిని తాగడం వలన జీవక్రియ బలపడుతుంది. అంతేకాకుండా.. శరీరంలో కొవ్వును బర్న్ చేస్తుంది. రక్తప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో ఎక్కువగా సహయపడుతుంది. శరీరంలో టాక్సిన్.. కొవ్వు పేరుకుపోవడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరగదు.. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం చాలా అవసరం… రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. ఫిట్‌గా ఉంటారు.
Also Read: Chinmayi Sripada: ఆ హక్కు నీకుంది.. ఎవరి పెత్తనం అవసరం లేదు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..