కొబ్బరి నీళ్లు(coconut water) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ కొబ్బరి నీళ్లు తాగితే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే… అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. జీవక్రియ రేటు పెరగడమే కాకుండా.. బరువు తగ్గుతారు. ఇందులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇవే కాకుండా.. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కొబ్బరి నీళ్లలో ఉన్నాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తీసుకుంటే ప్రమాదం.
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాకుండా…ఇతర సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది. అంతేకాకుండా విరేచనాలు కలుగుతాయి.
కొందరికి ప్రతిసారి జలుబు చేస్తుంటుంది. వీరు చల్లటి పదర్థాలు తింటే జలుబు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సందర్బంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. వాస్తవానికి కొబ్బరి నీళ్ల ప్రభావం చల్లగా ఉంటుంది. దీంతో జలుబు సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ఇక అధిక రక్తపోటుకు మందులు వాడేవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. దీనివలన మీకు తక్కువ రక్తపోటు సమస్య కలుగుతుంది.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Energy Drinks: యాక్టివ్‌గా ఉండాలంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగాల్సిందే.. ఇంట్లోనే ఈజీగా తయారు చేయండిలా..