Health Tips: మీరు 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పువు..

| Edited By: Ravi Kiran

Apr 18, 2022 | 9:47 AM

Sleeping Disorder: మన శరీరానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా కనీసం రోజుకు 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు.

Health Tips: మీరు 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పువు..
Sleeping Disorder
Follow us on

Sleeping Disorder: మన శరీరానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా కనీసం రోజుకు 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తారు. అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనం, ఉద్యోగాలు, ఇతర పనుల వల్ల చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ అర్ధరాత్రో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అందులోనూ కనీసం 6 గంటలు కూడా నిద్రపోనివారు మనలో చాలామంది ఉన్నారు. అయితే ఈ నిద్రలేమి ( Sleeping Disorder) వల్ల పలు మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని, ఫలితంగా తరచుగా జలుబు, ఇతర శారీరక సమస్యలతో బాధపడతారట. ఇక తక్కువగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందట.

ఒత్తిడి..
6 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే మానసిక స్థితి క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. కొన్నిసార్లు ఈ ఒత్తిడి బాగా పెరిగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది. నిద్ర లేమికి, డిప్రెషన్ కు చాలా సంబంధం ఉంది. డిప్రెషన్ ఉంటే నిద్ర రాదు, నిద్ర పట్టకపోతే డిప్రెషన్ వస్తుంది. కాబట్టి రోజులో కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

జ్ఞాపకశక్తి తగ్గుతుంది..

6-7 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఎక్కువగా ఆందోళన పడుతుంటారు. చాలా విషయాలను మర్చిపోతుంటారు. కాబట్టి నిద్రలేమి సమస్యలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. కావాలంటే ఇంట్లోనే యోగా చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు.

శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయి..

నిద్రలేమి మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతంది. ఏకాగ్రత సామర్థ్యం దెబ్బతింటుంది. ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు. ఫలితంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా రోజుకు కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌లకు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్లను దూరంగా పెట్టాలి.

Also Read: Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. నలుగురి మృతి..
Non BJP CM meet: మూడో కూటమి దిశగా మరో ముందడుగు.. ముంబయిలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీ!

Chanakya Niti: జీవితంలో ఆర్ధిక కష్టాలు రాకూడదంటే ఈ విషయాలను గుర్తుంచుకోమంటున్న చాణక్య