AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ లివర్‌ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం..

Liver Health: మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం (Liver) ఒకటి. ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయ పనితీరు సరిగ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని వడబోయపడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. దీని తర్వాత శరీరంలోని అన్ని భాగాలకు...

Liver Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ లివర్‌ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం..
Narender Vaitla
|

Updated on: Apr 18, 2022 | 3:04 PM

Share

Liver Health: మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం (Liver) ఒకటి. ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయ పనితీరు సరిగ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని వడబోయపడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. దీని తర్వాత శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. ఆహారం ద్వారా శరీరంలోకి వచ్చే రసాయనాలను కాలేయం తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కాలేయమే కీలకం. ఇలా శరీరంలో ఎంతో కీలకమైన కాలేయం ఏమాత్రం అనారోగ్యానికి గురైనా వెంటనే శరీరంపై ప్రభావం చూపుతుంది. అయితే కాలేయం పనితీరు దెబ్బతింటుందన్న విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే పసిగట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? కాలేయం అనారోగ్యాన్ని పసిగట్టే ఆ లక్షణాలు ఇవే..

* కాలేయం పనితీరులో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే చర్మం కింద అధిక స్థాయిలో చర్మం కింద పైత్య రసం పేరుకుపోతుంది. దీనివల్ల క్రమేణ చర్మం దురదకు దారి తీస్తుంటుంది. అనుకోకుండా వచ్చే చర్మ సమస్యలు కాలేయ సమస్యల కారణంగానే సంభవిస్తాయి. అయితే అన్ని సందర్భాల్లో చర్మ సమస్యలకు ఇదే కారణమని చెప్పలేం, ఇతర సమస్యల వల్ల కూడా చర్మ వ్యాధులు రావొచ్చు. కాబట్టి పరీక్షల అనంతరమే నిర్ధారణకు రావాలి.

* సాధారణంగా పచ్చ కామెర్లు రావడం సర్వ సాధారణమైన విషయం. కొన్ని రోజుల పాటు ఉండి తగ్గిపోతాయి. అయితే ఎక్కువ కాలం పాటు ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం లివర్‌ పనితీరు నెమ్మదించని అర్థం చేసుకోవాలి. కాబట్టి దీర్ఘకాలం పాటు ఈ సమస్య వెంటాడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

* గాయాలు త్వరగా మానకపోయినా కాలేయం పనితీరు సరిగ్గా లేదని భావించాలి. రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన ప్రోటీన్లను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి కాలేయం పనితీరు సరిగ్గా లేకపోతే గాయాలు కూడా ఆలస్యంగా మానుతుంటాయి. కాబట్టి ఈ సమస్య దీర్ఘకాలంగా ఎదురైతే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అంతేకాకుండా కాలేయం సరిగ్గా పనిచేయకపోతే కొన్ని సందర్భాల్లో వాంతులు, మలంలో రక్తం రావడం కూడా గమనించవచ్చు.

* తీసుకున్న ఆహరం జీర్ణం చేయడం కాలేయం ముఖ్య విధి అని తెలిసిందే. కాలేయం విడుదల చేసే పిత్త రసం ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ కాలేయం పనితీరు సరిగ్గా లేకపోతే ఆకలి తగ్గిపోతుంది. ఇది క్రమేణా కడుపు నొప్పి, బరువు తగ్గడం, వికారం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

* శరీరంలోకి వచ్చే రసాయనాలను ఫిల్టర్‌ చేయడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుందని ముందుగానే చెప్పుకున్నాం. ఒకవేళ కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో టాక్సిన్‌ విలువలు పెరుగుతాయి. దీంతో జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కారణంగా ఏకాగ్రత తగ్గడం, మానిసకం కల్లోలం, గందరగోళంగా ఉండడం లాంటివి జరుగుతుంటాయి.

నోట్‌: పైన తెలిపిన లక్షణాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించాము. అయితే కేవలం ఈ లక్షణాలనే ఆధారంగా చేసుకొని కాలేయం పనితీరు దెబ్బతిందన్న నిర్ణయానికి రాకూడదు. వైద్యులను సంప్రదించిన తర్వాత వారి సూచనల మేరకే ఎలాంటి చికిత్సనైనా మొదలు పెట్టాలి.

Also Read: Shivani Rajasekhar: దేవకన్యలా మైమరిపిస్తున్న అందాల సుందరి ‘శివాని’ లేటెస్ట్ ఫొటోస్..

Sachin Tendulkar: సచిన్‌ బాల్యాన్ని గుర్తుచేసిన బస్సు.. లోకల్‌ బస్సులో ఎక్కి ప్రయాణించిన సచిన్..

Mother House Arrest: దారుణం.. ఇంటిలో వివస్త్రగా.. కన్నతల్లిని పదేళ్లు బంధించిన కర్కోటకులు..!