గర్భిణీ స్త్రీలు తాము ప్రతిరోజూ తీసుకోబోయే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. ఖనిజాలు.. విటమిన్లు.. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారపదార్థాలను ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే గర్భిణీ స్త్రీలు కొన్ని సందర్భాల్లో వారు తీసుకునే ఆహార పదార్థాలు చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. సిట్రస్ పండ్ల విషయానికి వస్తే.. గర్భిణీ స్త్రీలు సిట్రస్ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. నిమ్మకాయలు.. నారింజ.. బెర్రీలు.. ద్రాక్ష మొదలైనవి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గర్భధారణ సమయంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. దీంతో ఇన్ఫెక్షన్స్, వ్యాధుల నుంచి రక్షించబడతారు. గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తీసుకోవడంపై అనేక అపోహలు ఉంటాయి.. కానీ వైద్యులు సూచనల ప్రకారం వీరు నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మరసం, నిమ్మకాయ షికంజి వంటివి తాగడం వలన గర్భంలో సమస్యలు రాకుండా ఉంటాయి.
గర్భధారణ సమయంలో నిమ్మరసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు.
* గర్భధారణ సమయంలో నిర్జలీకరణం నుండి తనను తాను రక్షించుకోవాలి. పండ్ల జ్యూస్ తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. అలాగే అనేక పోషక ప్రయోజనాలు కూడా శరీరానికి లభిస్తాయి. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నిమ్మరసం నీళ్లతో వికారం, వాంతులు, గ్యాస్ తదితర సమస్యలు కూడా తొలగిపోతాయి.
* చాలా మంది మహిళలకు గర్భధారణ సమయంలో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఉంటాయి. నిమ్మరసం ప్రకోప ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. దీంతో మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను నివారిస్తుంది.
* విటమిన్ సితో పాటు, నిమ్మకాయ కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది శరీరం నుండి మురికిని, ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరుస్తుంది. ఇది క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
* నిమ్మకాయ పుట్టబోయే బిడ్డకు కూడా మేలు చేస్తుంది. నిమ్మకాయలో పొటాషియం ఉంటుంది, ఇది ఎముకలు, నరాల కణాల అభివృద్ధికి, మెదడు అభివృద్ధికి అవసరమైనది.
* కొంతమంది మహిళలు గర్భం చివరి నెలల్లో అధిక రక్తపోటుతో ఇబ్బందిపడుతారు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రాణాంతకం కావచ్చు. ఇందులో నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం నిమ్మ ఆకుల రసం లేదా సారం రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. నిమ్మరసం పొటాషియం, మెగ్నీషియం, అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
* గర్భధారణ సమయంలో కాళ్ళలో వాపును తొలగించడానికి నిమ్మకాయ నీటిని కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుని తాగితే పాదాలలో వాపు సమస్య తగ్గుతుంది. వేడి నీళ్లలో కాస్త నిమ్మరసం, రాళ్ల ఉప్పు కలుపుకుని స్నానం చేయవచ్చు. ఇది వాపు, నొప్పిని తొలగిస్తుంది.
గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని అమలు చేయడానికి ముందుగా వైద్యులను సంప్రదించాలి.
Also Read: Viral Photo: ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. అబ్బాయిల కలల రాకుమారి మన తెలుగమ్మాయి..
KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే..
RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్ హాఫ్ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..