సాధారణంగా ఏదైనా ఆహారం తినగానే వెంటనే నీళ్లు తాగేస్తుంటాం. ఆహారమైనా.. ఏదైనా పండ్లను తిన్నగానీ నీళ్లు తాగుతుంటారు. అయితే కొన్ని పదార్థాలు తినగానే నీళ్లు తాగకూడదు అంటారు పెద్దవారు. దీనివలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మనం తినే ఆహారానికి నిర్ధష్ట మొత్తంలో PH అవసరం. ఇలాంటి సందర్భాల్లో నీళ్లతో కూడిన పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగడం హానికరం. ఏయే ఏయో ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదో తెలుసుకుందామా.
సాధారణంగా పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. కానీ పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. పండ్లలో చక్కర, ఈస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇది సరిగ్గా జీర్ణం కావాలి. ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలవుతుంది. మనం పండ్లు తిన్న తర్వాత నీరు తాగితే యాసిడ్ కరిగి పండు జీర్ణం కాదు. అలాగే పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఇవి తిన్న తర్వాత నీళ్లు తాగితే డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. అలాగే అన్నం తిన్నవెంటనే నీరు తాగడం మానుకోండి.
తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. అందుకే తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత నీరు తాగాలి. ఆయుర్వేదం ప్రకారం తిన్న వెంటనే నీళ్లు తాగితే ఉబకాయం వస్తుంది. ఐస్ క్రీం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. వేరు శెనగ.. నువ్వులు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఒకవేళ నీళ్లు తాగితే దగ్గు సమస్య వస్తుంది. ఇక చెరుకు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. చెరకులో క్యాల్షియం.. పోటాషియం ఎక్కువగా ఉంటాయి. తిన్న తర్వాత నీళ్లు తాగితే కడుపు, నోటిలో పగుళ్లు, పొక్కులు వచ్చే అవకాశం ఉంది.
Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..
Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..
Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..