Thyroid: థైరాయిడ్‌లో బరువు పెరిగి ఇబ్బందులు పడుతున్నారా..? అయితే, ఈ సూపర్‌ఫుడ్‌ను డైట్‌లో చేర్చుకోండి..

|

Sep 11, 2022 | 8:12 PM

Thyroid Weight loss: దీర్ఘకాలిక వ్యాధుల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాయిడ్ గ్రంథి మన మెడ వెనుక భాగంలో ఉంటుంది. ఇది శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తుంది. కానీ ఈ గ్రంథిలో

Thyroid: థైరాయిడ్‌లో బరువు పెరిగి ఇబ్బందులు పడుతున్నారా..? అయితే, ఈ సూపర్‌ఫుడ్‌ను డైట్‌లో చేర్చుకోండి..
Thyroid Weight Loss
Follow us on

Food for Weight loss: ప్రస్తుత కాలంలో చాలామంది థైరాయిడ్ (Thyroid) సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా మహిళల్లో కనిపించే ఈ సమస్య.. పురుషులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాయిడ్ గ్రంథి మన మెడ వెనుక భాగంలో ఉంటుంది. ఇది శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తుంది. కానీ ఈ గ్రంథిలో హైపో థైరాయిడిజం పరిస్థితి వస్తే ఆ వ్యక్తి బరువు చాలా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. ఇలా పెరిగిన బరువును తగ్గించుకోవడం కష్టమే.. అయినా సరైన జీవనశైలి, ఆహారం తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ.. మీరు కూడా బరువును తగ్గించుకోవాలనుకుంటే.. కొన్ని ఆహారాలతో సాధ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అయోడిన్ అధికంగా ఉండే ఆహారం: థైరాయిడ్లో బరువును తగ్గించుకోవాలనుకుంటే.. అయోడిన్ మంచిగా ఉండే పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉప్పు, చేపలు, గుడ్లు మొదలైన వాటిల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్లను నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

పండ్లు తినండి: పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్, మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు యాపిల్, జామూన్, అవకాడోలను తినాలి. ఎందుకంటే ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనితో పాటు థైరాయిడ్ ద్వారా శరీరానికి జరిగే నష్టాన్ని కూడా తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

విటమిన్ డి: శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే.. అది శరీరంలో వాపును కలిగిస్తుంది. ఇంకా బరువు కూడా పెరుగుతుంది. మీకు కూడా అలాంటి సమస్య ఉంటే ఉదయం, సాయంత్రం ఎండలో కూర్చోండి. దీనితో పాటు మీ ఆహారంలో గుడ్లు, కొవ్వు చేపలు, మాంసం, పుట్టగొడుగులు వంటి విటమిన్ డి అధిక మొత్తంలో లభించే ఆహారాలను తీసుకోండి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..