Health Tips: ఉపవాసాలు చేయడం ఎంత వరకు మంచిది.. ఇలా కూడా బరువు తగ్గించుకోవచ్చా.. ఏది నిజం..?

|

Jul 04, 2022 | 8:30 PM

మనలో చాలా మంది అనేక కారణాలగా ఉపవాసం ఉంటారు. ఒకరు దైవ చింతనతో ఉంటే మరొకరు డైటింగ్ పేరుతో ఫాస్టింగ్ చేస్తుంటారు.

Health Tips: ఉపవాసాలు చేయడం ఎంత వరకు మంచిది.. ఇలా కూడా బరువు తగ్గించుకోవచ్చా.. ఏది నిజం..?
Weight Loss Tips Hindi
Follow us on

Weight Loss Tips: బరువు తగ్గడం ఈ రోజుల్లో అతిపెద్ద పనిగా మారింది. అటువంటి పరిస్థితిలో  అంతా జిమ్, వ్యాయామం, యోగా, డైటింగ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ రోజుల్లో ఉపవాసం ద్వారా బరువు తగ్గే ట్రెండ్ బాగా పెరిగింది. మీరు డైట్ మార్పులు, వర్కవుట్ రొటీన్‌తో కూడా బరువు తగ్గవచ్చు. అందుకే ప్రజలు తమ రోజువారీ కేలరీల తీసుకోవడం కోసం ఉపవాసాన్ని ఆశ్రయిస్తారు. ఉపవాసం బరువు తగ్గించడంలో సహాయపడుతుందో లేదో తెలుసుకుందాం.

ఉపవాసం అంటే..?

ఉపవాసం అంటే రోజులో ఏదో ఒక సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండడం. మనలో చాలా మంది అనేక కారణాలగా ఉపవాసం ఉంటారు. ఒకరు దైవ చింతనతో ఉంటే మరొకరు డైటింగ్ పేరుతో ఫాస్టింగ్ చేస్తుంటారు. కొంతమంది బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటారు. ఉపవాసంలో మీ సంకల్ప శక్తి బలంగా ఉండాలి. మీరు బరువు తగ్గడానికి లేదా శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఉపవాసం ఉంటే.. మీరు నిర్దిష్ట సమయం వరకు నీరు తప్ప మరేమీ తీసుకోవల్సిన అవసరం లేదు.

ఉపవాసం బరువును ఎలా తగ్గిస్తుంది?

ఉపవాసంలో భోజనాల మధ్య సుదీర్ఘ విరామం ఉంటుంది. ఇది మీ మొత్తం కేలరీలను కరిగిస్తుంది. ఒక వ్యక్తి రోజుకు 2 వేల నుంచి 2,500 కేలరీల వరకు వినియోగిస్తారు. ఇందులో రోజుకు 3 పూటలా భోజనం, స్నాక్స్ తీసుకుంటూ.. శారీరక శ్రమ లేకుండా రోజుకు కేవలం 1800 కేలరీలు మాత్రమే బర్న్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఉపవాస సమయంలో ఒకేసారి ఆహారం తీసుకుంటే.. మధ్యలో ఎటువంటి స్నాక్స్ తీసుకోకపోతే మీ కేలరీల తీసుకోవడం 800 తగ్గుతుంది. ఇది శరీరంలో కేలరీల లోటును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ఉపవాసం ఆరోగ్యకరమైన మార్గమా?

బరువు తగ్గడానికి ఉపవాసం ఆరోగ్యకరమైన మార్గమా అని మీరు ప్రశ్నిస్తే.. దీనికి ఎవరి వద్ద సమాధానం దొరకదు. దీన్ని ఎక్కువ కాలం పాటిస్తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఇది డైటింగ్ నావిగేటింగ్ మార్గం అని అంటారు. మీరు ఆరోగ్యకరమైన బరువు, మంచి శరీరాన్ని పొందాలనుకుంటే సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం. ఉపవాసం వల్ల శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది, దాని వల్ల శరీరానికి పని చేసే శక్తి లభించదు. పరిమిత ఆహారాన్ని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల శరీరం, మనస్సు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది. దీని వల్ల అలసట తలనొప్పి సమస్య పెరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం..