Eggs Side Effects: గుడ్డుతో ఈ ఆహారపదార్థాలను తీసుకుంటున్నారా ? జాగ్రత్త మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే..

|

Apr 18, 2022 | 5:08 PM

గుడ్డు (Eggs) ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే.. ఇందులో బోలేడన్ని పోషకాలుంటాయి. ఇందులో ప్రోటీన్స్

Eggs Side Effects: గుడ్డుతో ఈ ఆహారపదార్థాలను తీసుకుంటున్నారా ? జాగ్రత్త మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే..
Eggs
Follow us on

గుడ్డు (Eggs) ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే.. ఇందులో బోలేడన్ని పోషకాలుంటాయి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉండడం వలన మన కండరాలను దృఢంగా మార్చడమే కాకుండా.. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్పాహరంలో గుడ్డును తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. గుడ్డును ఉడికించి.. లేదా ఆమ్లెట్ గా ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే శరీరానికి ఎంతో మేలు చేసే గుడ్డుతోపాటు.. కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యానికి హానికరం. పొరపాటున కూడా గుడ్డుతో కలిపి తీసుకోకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.

గుడ్లు, కాల్చిన మాంసం..
గుడ్లు కాల్చిన మాంసం తీసుకోకూడదు. ఇందులో ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన బద్దకానికి కారణమవుతుంది. అప్పటికప్పుడు ఎనర్జీ రావడానికి గుడ్డు, బేకన్ కలిపి తీసుకుంటే మీకు బద్ధకం వస్తుంది.

చక్కెర, గుడ్డు..
రెండు పదార్థాల నుంచి వచ్చే ఆమైనో ఆమ్లాల కలయిక శరీరానికి హానికరం. అంటే చక్కెర, గుడ్డు కలిపి తీసుకుంటే రక్తం గడ్డకట్టే సమస్యను మరింత ప్రోత్సహిస్తుంది.

సోయా పాలు, గుడ్డు..
జిమ్ లో వర్కవుట్స్ చేసేవారు సోయా పాలను గుడ్లను కలిపి తీసుకుంటారు. సోయా పాలతో గుడ్లు తినడం వలన శరీరంలో ప్రోటీన్ శోషణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది.

టీ, గుడ్డు..
చాలా మంది గుడ్డుతోపాటు.. టీని తీసుకుంటారు. టీతోపాటు.. గుడ్డును కలిపి తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.

పాల పదార్థాలు, గుడ్లు..
గుడ్లు సీతాఫలాలతో కలిపి తీసుకోవద్దు. ఇవి కాకుండా.. బీన్స్, చీజ్, పాలు, లేదా వీటితో తయారు చేసిన పదార్థాలతో గుడ్లు తీసుకోవడం అస్సలు మంచిది కాదు.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.

Also Read: F3 Movie: ఎఫ్ 3 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..

Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..

Samantha: ఆ ఆలోచనే మానుకోండి.. నెటిజన్లకు ఊహించని షాకిచ్చిన సమంత..