Benefits Of Mango: మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

మామిడి(Mango) పండును పండ్లలో రారాజు అని పిలుస్తారు. ఇది సీజనల్‌ ఫ్రూట్‌.. ఇది చాలా రుచికరమైన పండు. వేసవి(Summer)లో దొరికే ఈ పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి...

Benefits Of Mango: మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Mango Prices Hike
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 18, 2022 | 6:05 PM

మామిడి(Mango) పండును పండ్లలో రారాజు అని పిలుస్తారు. ఇది సీజనల్‌ ఫ్రూట్‌.. ఇది చాలా రుచికరమైన పండు. వేసవి(Summer)లో దొరికే ఈ పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. ఈ పండులో ఫైబర్(Fiber) అధికంగా ఉంటుంది. ఇందులో ఫోలేట్, బీటా కెరాటిన్, ఐరన్, విటమిన్లు A, C అలాగే కాల్షియం, జింక్, విటమిన్ E వంటి పోషకాలు ఉన్నాయి. ఈ రుచికరమైన పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో దస్సేరీ, లాంగ్రా, చౌసా ప్రసిద్ధి చెందాయి. మామిడి పండు ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

జీర్ణక్రియ

మామిడిలో చాలా గుణాలున్నాయి. ఇవి జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. మామిడి పండ్లలో నీరు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

రోగనిరోధక శక్తి

మామిడిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. మామిడి పండ్లలో కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, బి విటమిన్లు వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

చర్మం

మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మం ఆయిల్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ముడతలు, ఫైన్ లైన్స్ వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

గుండె

మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మామిడి పండ్లలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

బరువు 

మామిడిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీరు తక్కువ తినవచ్చు. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

రక్తపోటు

మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.

Note :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Liver Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ లివర్‌ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం..