AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: మీకు మడమ నొప్పి బాధిస్తుందా..? ఉపశమనం కోసం ఈ చిట్కాలను అనుసరించండి

Health Care: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే మరింత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక సాధారణంగా మడమ నొప్పితో ఇబ్బందిగా మారుతుంది...

Health Care: మీకు మడమ నొప్పి బాధిస్తుందా..? ఉపశమనం కోసం ఈ చిట్కాలను అనుసరించండి
Subhash Goud
|

Updated on: Apr 18, 2022 | 8:12 PM

Share

Health Care: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే మరింత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక సాధారణంగా మడమ నొప్పితో ఇబ్బందిగా మారుతుంది. ప్రజలు తరచుగా ఈ నొప్పిని విస్మరిస్తారు.  కానీ నిర్లక్ష్యం చేస్తే  భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది. చాలా సార్లు ప్రజలు ఉదయం నిద్ర లేచిన తర్వాత మడమల నొప్పి గురించి టెన్షన్‌కు గురవుతుంటారు. అయితే శరీరంలో పోషకాలు లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ (Arthritis) వ్యాధి కారణంగా మీరు చీలమండలలో కూడా నొప్పి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత చీలమండలలో నొప్పిని కలిగి ఉంటే, దానిని వదిలించుకోవడానికి కొన్ని ఇంటి నివారణలు కూడా పాటించవచ్చు.

సరైన ఆహారం..

సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి శారీరక సమస్యనైనా చాలా వరకు దూరం చేసుకోవచ్చు. మీరు చీలమండలలో నొప్పి ఉంటే అప్పుడు వైద్యుని సలహా తీసుకోండి. మీ ఆహారాన్ని మెరుగుపరచండి. విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఎందుకంటే జెయింట్స్‌లో నొప్పికి దాని లోపం ప్రధాన కారణం. ఉదయం నిద్రలేచిన తర్వాత మడమ నొప్పి ఉంటే ఒక టవల్ లో ఐస్‌ ముక్కను తీసుకొని చీలమండల మీద పెట్టండి. ఇలా 15 నిమిషాలు మాత్రమే చేసి, ఆపై పాదాలను చల్లటి నీటితో కడగాలి. ఎంతో ఉపశమనం కలుగుతుంది.

మసాజ్:

నొప్పిని తొలగించడానికి మసాజ్ మంచి మార్గంగా పరిగణించబడుతుంది. ఉదయం మేల్కొన్న తర్వాత మడమ మసాజ్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం ఉదయాన్నే ఆవాల నూనెను తీసుకుని తేలికపాటి చేతులతో మడమలు, పాదాలకు మసాజ్ చేయాలి. నిత్యం యోగా చేయడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. నేటి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయడం ఎంతో అవసరమంటున్నారు వైద్యులు. మడమ నొప్పి కోసం మీరు గోముఖాసనం, బలాసన్ యోగాసనాలు చేయాలి. ఈ యోగాసనాలు చేయడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. కండరాలలో సాగడం వల్ల వాటిలో ఉన్న నొప్పి తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి:

Benefits Of Mango: మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Millets Benfits: ఎదిగే పిల్లలకు చిరు ధాన్యాలు బెస్ట్.. ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!