Weight Loss: రోజూ పరగడుపున వేడి నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? అసలు విషయాలను తెలుసుకోండి..

|

Sep 16, 2021 | 8:18 PM

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు చాలా మంది ఆరోగ్యం మరింత శ్రద్ద చూపిస్తున్నారు. అలాగే ఇంట్లో తయారు చేసిన ఆహరాన్ని తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు.

Weight Loss:  రోజూ పరగడుపున వేడి నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? అసలు విషయాలను తెలుసుకోండి..
Hot Water
Follow us on

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు చాలా మంది ఆరోగ్యం మరింత శ్రద్ద చూపిస్తున్నారు. అలాగే ఇంట్లో తయారు చేసిన ఆహరాన్ని తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా.. వ్యాయమాలు.. యోగా అంటూ శరీరానికి కావాల్సినంత శ్రమ కల్పిస్తూ.. ఆకు కూరలు.. దుంపలు వంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ప్రారంభించారు. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా.. వయసుతో సంబందం లేకుండా.. చాలా వరకు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే యువతకు ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీంతో బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ ప్రారంభించడం.. వ్యాయమాలు చేయడం.. జిమ్‏లకు వెళ్లడం చేస్తుంటారు.

అయితే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చాలా వరకు ఫలితం కనిపించదు. దీంతో ఆసుపత్రిల వైపు ఆసక్తి చూపిస్తారు. అయితే చాలా మంది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‏ను తగ్గించేందుకు నీళ్లు ఎక్కువగా ఉపయోగపడతాయని అంటుంటారు. ఇందుకోసం ఉదయాన్నే పరగడపున గ్లాసు మంచినీళ్లు తాగాలంటారు. మన శరీరంలోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ప్రతి రోజుకు రెండు లేదా మూడు లీటర్ల నీళ్లు తాగాలంటారు. అయితే బరువు తగ్గేందుకు రోజు వేడినీళ్లు తాగాలంటారు. కానీ వేడి నీళ్లు తాగాడం వలన నష్టాలు, లాభాలు రెండు ఉంటాయి. వ్యాయమం చేసిన తర్వాత ఒక గ్లాసు చల్లని నీరు తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఇక అదే సమయంలో వేడి నీళ్లు తాగితే శరీరంలో విష పదార్థాలు బయటకు వెళ్లడమే కాకుండా.. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇటీవల జరిపిన ఓ అధ్యయంలో ఎక్కువగా నీరు తాగితే చెడు కొలెస్ట్రాల్ సులభంగా కరిగిపోతుందని తేలిందట. వేడి నీళ్లను రోజూ తాగడం వలన పొట్ట సులభంగా తగ్గుతుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. భోజనం చేయడానికి ముందు 500 మిల్లీ లీటర్ల నీరు తాగడం వలన జీవక్రియ ముప్పై శాతం పెరుగుతుందట. అలాగే శరీర ఉష్ణోగ్రత మారుతుంది. అలాగే తరచూ వేడిని నీటిని తాగడం వలన పొట్టలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ బర్న్ చేయడంలో సహయపడుతుందని తెలీంది. ఆకలి కూడా తగ్గుతుందట. వేడి నీరు తాగడం ఇష్టం లేని వారు.. భోజనానికి గంట ముందు సూప్ తాగడం వలన కూడా ఫలితం ఉంటుందట. అయితే తాజా కూరగాయలతో చేసిన సూపర్ తాగడం వలన ఫలితం ఉంటుందట.

Also Read: Acharya Movie: మరోసారి సెట్స్ పైకి ఆచార్య.. ఊటీ బాట పట్టిన చిరు.. చరణ్.. కారణమేంటంటే..

Varsha Bollamma: క్యూట్ ఫొటోలతో అదరగొట్టేస్తోన్న వర్ష బొల్లమ్మ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు..