Blood Donation: రక్తం కొరతతో ఎవరూ మరణించకూడనే సంకల్పం ఆ యువకుడి సొంతం.. రక్తదానంపై అవగాహనకు 21వేల కిలోమీటర్ల యాత్ర.

|

Dec 04, 2022 | 8:45 AM

మన దేశంలో ఏటా 12వేల మంది రక్తం అందుబాటులోకి లేకపోవడంతో మరణిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం రక్తదానంపై ఉన్న పోహలు, ప్రజలు స్వచ్చందంగా రక్తాన్ని దానం చేయడనికి ముందుకు రాకపోవడం.. దీంతో ఒక వ్యక్తి రక్తదానం పై అవగాహన కల్పించడం కోసం ఒకటి కాదు..రెండు కాదు...ఏకంగా 21 వేల కిలో మీటర్లు నడుస్తూ వాక్ ఫర్ బ్లడ్ అన్న నినాదంతో అవగాహన కల్పిస్తున్నాడు.

Blood Donation: రక్తం కొరతతో ఎవరూ మరణించకూడనే సంకల్పం ఆ యువకుడి సొంతం.. రక్తదానంపై అవగాహనకు 21వేల కిలోమీటర్ల యాత్ర.
Kiran Verma
Follow us on

అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో.. ఇప్పుడు ప్రాణాలను నిలబెట్టే రక్తదానం కూడా అంతే గొప్పది. సాటి మనిషిని రక్షించడానికి రక్తాన్ని ఇచ్చే ప్రక్రియను రక్తదానం అని అంటారు. బాధితులకు తగిన సమయంలో రక్తం డొనేట్ చేయవచ్చు.. లేదా ముందుగా రక్తం దానం చేసినా బ్లడ్ బ్యాంక్‌లో తగిన రీతిలో రక్తం నిల్వ చేయబడుతుంది. ఎవరైనా బాధితులకు రక్తం అవసరమైనప్పుడు ఈ రక్తం మార్పిడి చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి జీవించి ఉండేలా.. శరీరంలోని ఇతర విధులు నిర్వహించేలా రక్తం తన బాధ్యతను నిర్వహిస్తుంది. యాక్సిడెంట్ వంటి కొన్ని సందర్భాల్లో రక్తం కొరత ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే రక్తం ఎక్కించకపోతే ఆ మనిషి ప్రాణం కోల్పోతాడు.

మీకు తెలుసా.. మన దేశంలో ఏటా 12వేల మంది రక్తం అందుబాటులోకి లేకపోవడంతో మరణిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం రక్తదానంపై ఉన్న పోహలు, ప్రజలు స్వచ్చందంగా రక్తాన్ని దానం చేయడనికి ముందుకు రాకపోవడం.. దీంతో ఒక వ్యక్తి రక్తదానం పై అవగాహన కల్పించడం కోసం ఒకటి కాదు..రెండు కాదు…ఏకంగా 21 వేల కిలో మీటర్లు నడుస్తూ వాక్ ఫర్ బ్లడ్ అన్న నినాదంతో అవగాహన కల్పిస్తున్నాడు.

రక్తదానంపై అవగాహన కల్పించడంకోసం కిరణ్ వర్మ అనే యువకుడు చేపట్టిన 21 వేల కిలో మీటర్ల నడక ఈ రోజు ఒంగోలుకు చేరుకుంది.. తిరువనంతపురం నుండి వాక్‌ పర్‌ బ్లడ్‌ అన్న నినాదంతో రక్తదానంపై అవగాహన కోసం డిసెంబర్ 28 -2021న నడక ప్రారంభించాడు కిరణ్ వర్మ.. ఆ నేపథ్యంలో ఒంగోలులోని ప్రధాన రహదారుల్లో వెళుతున్న ప్రజలకు రక్తదానం ఆవశ్యకతను వివరించారు.. ఆయన ప్రారంభించిన అతి సుదీర్ఘమైన రక్త దాన అవగాహన ప్రచారం, ఇంకా 2 సంవత్సరాల పైగా కొనసాగనుంది. కిరణ్ వర్మ మాట్లాడుతూ 31 డిసెంబర్ 2025 తర్వాత దేశంలో రక్తం కోసం ఎదురుచూస్తూ ఎవరూ చనిపోకూడదని, ప్రజలకు రక్తదానం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా నడక కొనసాగుతుందని తెలిపారు. రక్త దానం చేయడమంటే ఇంకోకరికి ప్రాణదానం చేయడంతో సమానం అన్నారు. ఒక్కసారి రక్తదానం చేస్తే.. దాంతో ముగ్గురి ప్రాణాలు కాపాడోచ్చని , ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ నడక చేపట్టానని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..