Kidney Health Tips: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు. రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుండటంతో వాటిల్లో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. కిడ్నీల పనితీరు బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే అవయవాలు పనితీరు దెబ్బతిని.. అనారోగ్యాలకు గురవుతుంటాం. అందుకే మూత్ర పిండాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కిడ్నీల పనితీరు బాగుండాలంటే.. వ్యర్థాలు, విష పదార్థాలను రోజూ బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి. కిడ్నీలను శుభ్రం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆహారంతోనే కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోవచ్చు. ఈ రోజు కిడ్నీలను శుభ్రంచేసే దివ్య ఔషధం తయారీ గురించి తెలుసుకుందాం..
కావల్సిన పదార్ధాలు:
కొత్తిమీర/ కర్వేపాకు
నీరు
నిమ్మరసం
తేనె
తయారీ విధానం: ముందుగా కొత్తిమీర కట్ట తీసుకుని శుభ్రం చేసుకుని .. తర్వాత ఆకులను సన్నగా తరగాలి. ఇప్పుడు స్టౌ మీద ఒక గిన్నె పెట్టి.. అందులో గ్లాస్ నీటిని వేసి.. ఆ నీటిని మరిగించాలి. మరుగుతున్న నీటిలో శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఆకులను వేసి.. మరో కొంచెం సేపు ఆనీటిని మరిగించాలి. అనంతరం ఆ నీటిని చల్లార్చాలి. బాగా చల్లారిన తర్వాత ఆ నీటిని ఒక గాజు గ్లాసులోకి వడకట్టు కోవాలి. ఇప్పుడు..ఆ కొత్తిమీర నీటిలో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా ఈ కొత్తిమీర ఔషధాన్ని రోజుకు ఒక ఒకసారి తాగాలి. ఈ ఔషధాన్ని తాగడానికి నిర్ధీన సమయం అంటూ లేదు. ఎప్పుడైనా తాగవచ్చు. దీని వల్ల కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పోయి కిడ్నీలు శుభ్రమవుతాయి. కొత్తిమీర ఇష్టం లేనివారు.. కొత్తిమీర బదులుగా కరివేపాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇవి కూడా కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పంపి మూత్రపిండాలను సంరక్షిస్తాయి.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ తగినంత నీటిని తాగాలి. నిమ్మజాతికి చెందిన లేదా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే పాలకూర, టమాటా వంటి ఆహారాలను వీలైనంత మేర తక్కువగా తీసుకోవాలి.
Also Read: ఆదివారం వ్యాక్సిన్ వేయించుకుంటే లక్కీ డ్రా.. వాషింగ్ మెషీన్స్, గ్రైండర్లు బహుమతి.. ఎక్కడంటే