రక్తంలో క్రియాటినిన్ ఎందుకు పెరుగుతుంది..? ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు దెబ్బతింటున్నట్లే..

శరీరానికి మంచి మూత్రపిండాల ఆరోగ్యం చాలా ముఖ్యం.. కానీ చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి కిడ్నీల ఆరోగ్యం క్షీణించడానికి దారితీయవచ్చు. దీనికి ఒక ప్రధాన కారణం క్రియాటినిన్ స్థాయిలు పెరగడం లేదా తగ్గడం.. క్రియాటినిన్ గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకోండి..

రక్తంలో క్రియాటినిన్ ఎందుకు పెరుగుతుంది..? ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు దెబ్బతింటున్నట్లే..
Kidney Health

Updated on: Apr 01, 2026 | 4:17 PM

గత కొన్నేళ్లుగా మూత్రపిండాల సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. మూత్రపిండాలకు కలిగే నష్టం మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అవయవం దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం క్రియాటినిన్ స్థాయిలు క్షీణించడం. చాలా మూత్రపిండాల వ్యాధులు అధిక లేదా తక్కువ క్రియాటినిన్ స్థాయిల వల్లే వస్తాయి. క్రియాటినిన్ అంటే ఏమిటి, అది ఎందుకు క్షీణిస్తుంది..? అది ఎంత ప్రమాదకరం.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమాన్షు వర్మ.. క్రియాటినిన్ స్థాయిల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రక్తంలో క్రియేటినిన్ (Creatinine) పెరగడానికి ప్రధాన కారణం కిడ్నీలు (మూత్రపిండాలు) రక్తాన్ని సరిగ్గా వడపోత చేయకపోవడమని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రజలు చిన్న వయసులోనే మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్నారని.. దీనికి ఒక కారణం క్రియాటినిన్ స్థాయిలు క్షీణించడం. క్రియాటినిన్ అనేది సాధారణ శరీర పనితీరు సమయంలో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం.. ఇది రక్తప్రవాహం ద్వారా మూత్రపిండాలకు చేరుతుంది. మూత్రపిండాలు దానిని వడపోసి, ఆ తర్వాత మూత్రం ద్వారా విసర్జిస్తాయి. శరీరంలో అధిక క్రియాటినిన్ స్థాయిలు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందుకే క్రియాటినిన్ స్థాయిలను మూత్రపిండాల పనితీరుకు ఒక ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు.

క్రియాటినిన్ స్థాయిలు పెరగడం వల్ల కనిపించే లక్షణాలు

రక్తంలో క్రియాటినిన్ స్థాయిలు పెరగడం వల్ల కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. అలసట, కాళ్లు-ముఖం వాపు, మూత్ర విసర్జనలో మార్పులు (తక్కువగా రావడం లేదా నురగ), వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు (BP) వంటి లక్షణాలు కనిపిస్తాయి.

క్రియేటినిన్ ఎందుకు పెరుగుతుంది?

డాక్టర్ హిమాన్షు దీనికి అనేక కారణాలను పేర్కొన్నారు. తక్కువ నీరు త్రాగడం, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం, కొన్ని మందుల దుష్ప్రభావాలు, అధిక రక్తపోటు వంటివన్నీ శరీరంలోని క్రియేటినిన్ స్థాయిలకు దోహదం చేస్తాయి. క్రియేటినిన్ స్థాయిలు పెరగడం, తగ్గడం రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. అధిక క్రియేటినిన్ స్థాయి మూత్రపిండాలపై పెరిగిన ఒత్తిడిని సూచిస్తుంది. దీనికి తక్షణ శ్రద్ధ అవసరం. మరోవైపు, తక్కువ క్రియేటినిన్ స్థాయి మూత్రపిండాల నష్టాన్ని సూచిస్తుంది. అయితే, అధిక క్రియేటినిన్ స్థాయి మరింత ప్రమాదకరం.. కానీ.. తక్కువ క్రియేటినిన్ స్థాయి అంతగా హాని కలిగించదు.

క్రియేటినిన్ సాధారణ స్థాయిల సాధారణ పరిధి ఏమిటి?

క్రియేటినిన్ సాధారణంగా, ఈ స్థాయి 0.7 – 1.3 mg/dL మధ్య ఉండాలి.. ఎక్కువగా లేదా.. తక్కువగా ఉండటం ప్రమాదకరం.. అయినప్పటికీ వయస్సు, కండరాల పరిమాణం, ప్రయోగశాల డేటాను బట్టి ఇది కొద్దిగా మారవచ్చు..

మూత్రపిండాల ఆరోగ్యానికి ఏమి చేయాలి

ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గ్లాసుల నీటిని తగినంతగా తాగండి.

ఉప్పు తగ్గించండి, రోజుకు 5 గ్రాములకు మించకూడదు

ప్రోటీన్ తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

ప్రతిరోజూ వ్యాయామం చేయండి

మీకు ఏమైనా సందేహాలున్నా లేదా ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us