
మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉదయం పూట కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోకూడదు అని చెన్నై యూరాలజిస్ట్ డాక్టర్ వెంకట్ సుబ్రమణియం హెచ్చరించారు. ఉదయం పూట చేసే 5 సాధారణ అలవాట్లు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు:
ఉదయం నీరు త్రాగకపోవటం: రాత్రి వేళ ఉపవాసం తర్వాత మన శరీరం, కిడ్నీలు కొద్దిగా డీహైడ్రేషన్ గురవుతాయి. కాఫీ, టీ తాగే ముందు కనీసం ఒక గ్లాసు నీటితో రోజు ప్రారంభించండి అని డాక్టర్ వెంకట్ తెలిపారు.
మూత్రాన్ని ఆపుకోవటం: రాత్రంతా మూత్రాన్ని ఆపుకోవటం వలన మూత్రాశయం సాగిపోయి, ఖాళీ చేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఉదయం పూట లేక పగలైనా ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోకూడదు. ఇది కిడ్నీలపై, మూత్రాశయంపై ఒత్తిడి పెంచుతుంది.
ఖాళీ కడుపుతో పెయిన్‌కిల్లర్స్: పెయిన్‌కిల్లర్స్ సరైన పద్ధతిలో తీసుకోకపోతే కిడ్నీలకు హాని చేస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు ఈ ప్రమాదం పెరుగుతుంది. ఎప్పుడూ సూచనలు పాటించి, ఆహారం లేక నీటితో వాటిని తీసుకోండి.
వ్యాయామం తర్వాత హైడ్రేషన్ లేకపోవటం: ఉదయం వ్యాయామం చేయటం మంచిది. కానీ పోస్ట్-వర్కౌట్ హైడ్రేషన్ అంత ముఖ్యం. నీరు తాగటం వలన కిడ్నీలు టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి. డీహైడ్రేషన్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.
అల్పాహారం మానేయటం: డాక్టర్ వెంకట్ ఉదయం పూట ప్రోటీన్ అధికంగా ఉన్న ఆరోగ్యకరమైన అల్పాహారం తినమని సిఫార్సు చేస్తున్నారు. అల్పాహారం మానేస్తే అధికంగా ఉప్పు ఉన్న స్నాక్స్ తినే అవకాశం ఉంది. ఈ అధిక సోడియం కిడ్నీలపై ఒత్తిడి పెడుతుంది.
ఈ సాధారణ చిట్కాలు పాటించటం వలన మీ ఉదయాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుకోవచ్చు. మీ కిడ్నీలను కూడా రక్షించుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన ఆరోగ్య సమాచారం చెన్నై యూరాలజిస్ట్ డాక్టర్ వెంకట్ సుబ్రమణియం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ వివరాలను నిపుణుల సలహాగా పరిగణించాలి, కానీ ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.