Kidneys Health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డిటాక్స్ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోండి.. ఎందుకంటే..?

|

Aug 11, 2022 | 11:07 AM

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం, తగినంత నీరు తాగాలి. దీని ద్వారా మాత్రమే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Kidneys Health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డిటాక్స్ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోండి.. ఎందుకంటే..?
Kidney Detox Drinks
Follow us on

Kidney Detox Drinks: కిడ్నీ మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇవి శరీరంలోని అనేక విధులను చేపట్టి ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. కావున కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం, తగినంత నీరు తాగాలి. దీని ద్వారా మాత్రమే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అదే సమయంలో శరీరంలో తగినంత మొత్తంలో నీరు ఉంటే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని డిటాక్స్ చేయడం కూడా చాలా అవసరం. అటువంటి పరిస్థితిలో మీ ఆహారంలో కొన్ని పానీయాలను చేర్చుకోవచ్చు. మీరు కూడా కిడ్నీలను డిటాక్స్ చేయాలంటే..? ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం చాలాముఖ్యం. కిడ్నీని నిర్విషీకరణ చేసే పానీయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీ టిటాక్స్ డ్రింక్స్..

యాపిల్ వెనిగర్‌: యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సిడ్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్లను కరిగించడంతో పాటు టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. దీని సహాయంతో డిటాక్స్ డ్రింక్ సిద్ధం చేయవచ్చు. దీని కోసం మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలపి ప్రతిరోజూ తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీల నిర్విషీకరణ జరుగుతూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దానిమ్మ రసం: దానిమ్మలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కావున ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో ఉండే గుణాలు రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. అందుకే ప్రతిరోజూ తాజా దానిమ్మ రసాన్ని తీసుకోవడం మంచిది.

బీట్‌రూట్ రసం: బిట్ రూట్ రసంలో బీటైన్ ఉంటుంది. ఇది చాలా ప్రయోజనకరమైన ఫైటోకెమికల్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో రోజూ బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే కిడ్నీలు డిటాక్స్ చేయడంతో పాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం