Health: కళ్లు పసుపు పచ్చగా కనిపిస్తే కామెర్లే కావాల్సిన అవసరం లేదు.. ఈ కారణాలు కూడా అయ్యుండొచ్చు..

| Edited By: Rajitha Chanti

Dec 20, 2021 | 9:06 AM

Health: పచ్చ కామెర్లు ఆరోగ్యానికి ప్రమాదకరమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా పచ్చ కామెర్లు వస్తే జ్వరంతో పాటు కళ్లు, గోళ్లు పసుపు పచ్చగా మారుతాయి. దీని ఆధారంగానే..

Health: కళ్లు పసుపు పచ్చగా కనిపిస్తే కామెర్లే కావాల్సిన అవసరం లేదు.. ఈ కారణాలు కూడా అయ్యుండొచ్చు..
Health Problem
Follow us on

Health: పచ్చ కామెర్లు ఆరోగ్యానికి ప్రమాదకరమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా పచ్చ కామెర్లు వస్తే జ్వరంతో పాటు కళ్లు, గోళ్లు పసుపు పచ్చగా మారుతాయి. దీని ఆధారంగానే పచ్చ కామెర్లు వచ్చాయన్న విషయాన్ని నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారు. సాధారణంగా ర‌క్తంలోని మృత క‌ణాల‌ను మన లివ‌ర్ ఎప్పటికప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ లివ‌ర్ ప‌నుల‌కు ఆటంకం ఏర్పడితే.. అప్పుడు మృత క‌ణాలు బ‌య‌ట‌కు పోవు. ఈ కణాలు శరీరంలో పేరుకుపోవడంతో శ‌రీరం ప‌సుపు ప‌చ్చగా మారుతుంది. ఈ స్థితిని ప‌చ్చ కామెర్లు అంటారు. అయితే కేవలం పచ్చ కామెర్లు ఉన్నప్పుడే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా కళ్లు పచ్చగా మారుతుంటాయి. ఇంతకీ కళ్లు పచ్చగా మారే ఆ సందర్భాలు ఏంటో తెలుసుకుందామా..

* కలుషితమైన ఆహారాలను తీసుకున్నప్పుడు కూడా కొందరిలో శరీరంలో రంగు మారే అవకాశం కనిపిస్తుంది. ఫుడ్‌ పాయిజిన్‌ అయిన సందర్భంలో కూడా కొందరి కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారుతుంది.

* వైరల్‌ ఇన్ఫెక్షన్లతో బాధపడే సమయంలో కూడా గోళ్లు పచ్చ రంగులోకి మారుతుంటాయి. అలాగే రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉన్నా ఇలాంటి మార్పే కనిపిస్తుంది.

* క్యాన్సర్‌ మందులను వాడే వారిలో కూడా శరీరం రంగు పచ్చ రంగులోకి మారడానికి గమనించవచ్చు.

* ఇక ఇన్ఫెక్షన్‌ ఉన్న రక్తం శరీరంలోకి ఎక్కించినా శరీరం రంగు పసుపు రంగులోకి మారుతుంది.

చూశారుగా శరీరం పసుపు రంగులోకి మారడానికి కేవలం కామెర్లు ఒక్కటే కారణం కాకపోతుండొచ్చు. కాబట్టి కళ్లు పచ్చగా మారగానే పచ్చ కామెర్లు అని నిర్ధారణకు రాకుండా ముందుగా వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకున్న తర్వాతే చికిత్స తీసుకోవాలి.

Also Read: Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..

Migraine: మైగ్రేన్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారా? మందులు పనిచేయడం లేదా? ఇలా చేయండి చాలు అంటున్నారు నిపుణులు!

Viral Video: అదృష్టమంటే ఈ కుక్కదే !! ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు.. వీడియో