Health: ఈ ఆహారాలకు దూరంగా ఉంటే.. అజీర్తి సమస్యకు పరిష్కారం దొరికినట్లే..

|

Aug 22, 2022 | 10:05 PM

మనం తినే ఆహారం జీర్ణం కావడం లేదని చాలా మంది బాధపడుతుంటాం.. ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో అజీర్తి సమస్యలు ఎక్కువ ఉత్పన్నమవుతాయి. తినే ఆహారంలో జీర్ణమయ్యే గుణం

Health: ఈ ఆహారాలకు దూరంగా ఉంటే.. అజీర్తి సమస్యకు పరిష్కారం దొరికినట్లే..
Digestive System
Follow us on

Indigestion: మనం తినే ఆహారం జీర్ణం కావడం లేదని చాలా మంది బాధపడుతుంటాం.. ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో అజీర్తి సమస్యలు ఎక్కువ ఉత్పన్నమవుతాయి. తినే ఆహారంలో జీర్ణమయ్యే గుణం లేకపోవడంతో చాలా మంది అజీర్తి సమస్యతో బాధపడుతుంటారు. ఈసమస్య నుంచి బయటపడాలంటే తినే ఆహారంపై ప్రధానంగా దృష్టి సారించాలి. అజీర్తి సమస్యను అధిగమించాలంటే మనకు నచ్చిన ఆహారాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. రోజూ తినే ఆహారంలో పండ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. మసాలాలు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని దూరం పెట్టాలి. అజీర్తితో బాధపడుతున్నవారు ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

వేపుడు పదార్థాలు : నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఈపదార్థాలు గుండెల్లో మంటను కలిగిస్తాయి. ఎక్కువ వేయించిన పదార్థాలు త్వరగా జీర్ణం కావు. ఫలితంగా అజీర్తి సమస్య వస్తుంది.

కెఫిన్: అజీర్తి సమస్యతో బాధపడేవారు కెఫిన్ ను తీసుకోవాడం మానుకోవాలి. కాఫీలో ఉండే ఈపదార్థం ఆరోగ్య పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలకు కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

పాల ఉత్పత్తులు: ఆవు పాలతో తయారైన ఉత్పత్తులు యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమయ్యే అవకాశాలు ఎక్కువు. అందుకే అజీర్తి సమస్యతో బాధపడుతుంటే అటువంటి ఉత్పత్తులను తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఎప్పుడైనా ఆవు పాలతో తయారైన ఉత్పత్తులనుత తీసుకుంటే తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు: స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ అజీర్తి సమస్యలు వస్తాయి. కారం, మసాలాలు ఎక్కువుగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా పొట్ట ఉబ్బసనానికి కారణమవుతుంది. ఇది అజీర్ణం, గుండెల్లో మంటను కలిగిస్తుంది.

అజీర్తి సమస్యతో బాధపడేవారు పై ఆహార పదార్థాలకు సాధ్యమైనంత ఎక్కువు దూరంగా ఉండటం మంచిది.