Rice: పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా? తింటె ఏమౌతుంది?

|

Apr 26, 2024 | 8:23 AM

సిటీల్లో అయితే బియ్యాన్ని ఎక్కువగా నిల్వ చేయరు కానీ.. పల్లెల్లో మాత్రం సంవత్సర కాలం వరకూ నిల్వ చేసుకుంటారు. అలాంటప్పుడు బియ్యానికి పురుగులు పడుతూ ఉంటాయి. పైగా పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేసుకుని తినడం వల్ల వ్యాధులు వస్తాయని కొందరు అంటారు.. అలాంటిది ఏమీ ఉండదని కొందరి వెర్షన్. ఇందులో ఏది నిజం...

Rice: పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా? తింటె ఏమౌతుంది?
Rice
Follow us on

సిటిల్లో 25, 30 కేజీల రైస్ బ్యాగులు తెచ్చుకుంటారు. ఇవి చిన్న ఫ్యామిలీలకు రెండు, మూడు నెలలు వస్తాయి. పురుగులు పట్టేందుకు పెద్దగా అవకాశం ఉండదు.  పల్లెటూర్లలో అయితే ఏడాదికి సరిపడా వడ్లు ఒక్కసారే మిల్లులో ఆడించి.. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఎక్కువకాలం నిల్వ ఉంచడం చేత బియ్యానికి పురుగులు పట్టే అవకాశం ఉంటుంది. అలాంటిప్పుడు.. ఆ బియ్యాన్ని చెరిగి.. పురుగులను వేరు చేసి.. రైస్ వండుకుని తింటుంటారు. ఇలా చెయ్యడం మంచిదేనా.. ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నిపుణులు చెబుతున్న వివరాల ప్రకరాం.. నిల్వ ఉంచిన బియ్యానికి ముక్కు పురుగులు,  నుసి పురుగులు, లద్ది పురుగులు వంటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి. అయితే పురుగులను చెరిగి.. ఆ బియ్యంతో అన్నం వండి తింటే పెద్దగా ప్రమాదం ఏమీ లేదంటున్నారు నిపుణులు. అన్నం వండే ముందు బియ్యాన్ని అందరూ కడుగుతారు. ఆ తర్వాత నీటిలో ఉడకబెడతారు. ఆ వేడికి.. బియ్యంలో ఏదైనా బ్యాక్టీరియా, కీటకాల వ్యర్థాలు వంటివి ఉన్నా చనిపోతాయి. కాబట్టి హెల్త్‌పై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అన్నది నిపుణుల వెర్షన్. అలానే బియ్యం జోలికి పురుగులు రాకుండా… ఈ మధ్య బోరిక్ పౌడర్, ఆముదం నూనె వంటి వాటిని కూడా బియ్యం డబ్బాల్లో ఉంచుతున్నారు. ఈ ప్రయత్నం మీరు కూడా చేయవచ్చు. అలానే బియ్యం బస్తాలు, డబ్బాలకు సమీప ప్రాంతంలో తేమ లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలానే బియ్యం నిల్వ ఉంచే ప్రాంతంలో.. లవంగాలు, ఇంగువ, ఎండు మిరపకాయలు,  మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు వంటివి ఉంచడం వల్ల.. వాటి వాసనకు పురుగులు దూరంగా ఉంటాయని అంటున్నారు. అలానే బియ్యంలో వేపాకు, బిర్యానీ ఆకులూ వేసినా ప్రయోజనం ఉంటుందంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..