
Coffee
కాఫీ చాలా మందికి ఇష్టమైన డ్రింక్. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ తాగడం మానుకోవడమే మంచిది. కాఫీలో ఉండే కెఫీన్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేంటో ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
కాఫీ వల్ల కలిగే దుష్ప్రభావాలు
- నిద్రలేమి.. కెఫీన్ నిద్రను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి పూట కాఫీ తాగితే నిద్ర పట్టడం కష్టమవుతుంది.
- ఆందోళన, వణుకు.. ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ఆందోళన, చిరాకు, చేతులు వణకడం వంటివి జరగవచ్చు.
- జీర్ణ సమస్యలు.. కాఫీలోని ఆమ్ల గుణం వల్ల ఖాళీ కడుపుతో తాగితే కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రావచ్చు. ఇది అల్సర్స్ లేదా పేగు రుగ్మతలకు కూడా దారితీసే అవకాశం ఉంది.
- గుండె వేగం పెరగడం.. గుండె జబ్బులు ఉన్నవారిలో కాఫీ వల్ల గుండె వేగం పెరుగుతుంది. ఇది ప్రమాదకరం.
ఎవరూ కాఫీకి దూరంగా ఉండాలి..?
- గర్భిణీలు.. రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు బరువు తక్కువగా ఉండటం. నెలలు నిండకుండా ప్రసవం లేదా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.
- గుండె జబ్బులు ఉన్నవారు.. అధిక రక్తపోటు, అరిథ్మియా (Arrhythmia) లేదా ఇతర గుండె జబ్బులు ఉన్నవారు కాఫీ తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
- ఎముకలు బలహీనంగా ఉన్నవారు.. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి. కెఫీన్ శరీరంలో కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. దీని వల్ల ఎముకలు మరింత బలహీనంగా మారవచ్చు.
- అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు.. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఎసిడిటీ, కడుపులో మంట, అల్సర్స్ వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
- నిద్రలేమి, ఆందోళనతో బాధపడేవారు.. కెఫీన్ ఈ సమస్యలను మరింత పెంచుతుంది.
కాఫీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం, కాఫీని మితంగా తాగడం మంచిది. అలాగే సాయంత్రం తర్వాత కాఫీ తాగకుండా ఉండటం వల్ల నిద్ర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)