Anemia: రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారా..? ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో పూర్తిగా చెక్ పెట్టొచ్చు..

|

May 10, 2022 | 9:07 AM

రక్తహీనత సమస్యతో బాధపడుతుంతే.. మీరు ప్రతిరోజూ ఈ నాలుగు జ్యూస్‌లలో ఏదైనా ఒక దానిని తాగితే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Anemia: రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారా..? ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో పూర్తిగా చెక్ పెట్టొచ్చు..
Anemia
Follow us on

Best Home Remedies For Anemia: ప్రస్తుత కాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. వాస్తవానికి శరీరంలో రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అని అంటారు. రక్తహీనత ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు. అప్పుడప్పుడు వారికి ఆరోగ్యంగా అనిపించినప్పటికీ.. అతని శరీరం లోపల శక్తి ఉండదు. కొన్నిసార్లు బలహీనత చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎంత అంటే శరీరం కూడా తనను తాను కాపాడుకోలేకపోతుంది. దీంతో కళ్ళు, చర్మం రంగు పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. గోర్లు తెల్లగా, పొడిగా మారి గరుకుగా కనిపిస్తాయి. రక్తహీనత ప్రధానంగా శరీరంలో ఐరన్ (ఇనుము), పోషకాల కొరత కారణంగా సంభవిస్తుంది. కానీ కొన్ని తీవ్రమైన వ్యాధులు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. ఈ విషయంలో పూర్తి పరీక్షల అనంతరం.. వైద్యులు మాత్రమే సరైన సలహా ఇవ్వగలరు. ఎందుకంటే రక్తహీనతకు కారణం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో కుటుంబంలో ఎవరైనా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లయితే.. మీరు ప్రతిరోజూ ఈ నాలుగు జ్యూస్‌లలో ఏదైనా ఒక దానిని ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే.. అందరికీ నచ్చిన రుచితోపాటు.. ఈ రసాలన్నీ శరీరంలో హిమోగ్లోబిన్‌ పరిమాణాన్ని పెంచి రక్తహీనతకు చెక్ పెడతాయని పేర్కొంటున్నారు. ఆ జ్యూస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం..

అలోవెరా జ్యూస్ : అలోవెరా ఒక అద్భుతమైన హెర్బల్ జ్యూస్. దీనిని తాగడం లేదా చర్మం, జుట్టుపై ఉపయోగించడం ఎల్లప్పుడూ ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు కలబంద జ్యూస్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. దీంతోపాటు హిమోగ్లోబిన్ పరిమాణం సైతం పెరుగుతుంది.

ద్రాక్షపండు రసం: ద్రాక్షను తినవచ్చు లేదా వాటితో రసాన్ని చేసి కాస్త నల్ల ఉప్పు జోడించి తాగవచ్చు. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంతోపాటు హిమోగ్లోబిన్‌ను పెంచేందుకు ద్రాక్ష సహకరిస్తుంది.

మామిడికాయతో రక్తహీనతకు చెక్: పండిన మామిడిపండ్లు శరీరంలోని రక్తహీనతను తొలగిస్తాయి. ప్రతిరోజూ మామిడిపండు తినండి. మామిడి పండు తిన్న రెండు గంటల తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగండి. దీంతో శరీరంలో రక్తం క్రమంగా పెరుగుతుంది.

బీట్‌రూట్ జ్యూస్: బీట్‌రూట్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని రక్తహీనతను తొలగించే చర్చ వచ్చినప్పుడల్లా.. బీట్‌రూట్ వెంటనే గుర్తు చేసుకుంటాం.. ఇంటి నివారణలు, డైట్‌కు సంబంధించిన విషయాలలో ఖచ్చితంగా బీట్‌రూట్ ప్రస్తావన వస్తుంది. కావున రక్తహీనతతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసి తాగడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Fruits for Arthritis: కీళ్ల నొప్పులతో అల్లాడుతున్నారా..? అయితే మూడు పండ్లను తప్పనిసరిగా తినండి..

Muskmelon Benefits: వేసవిలో కర్బూజను తింటున్నారా..? అయితే.. ఈ విషయాలపై లుక్కేయాల్సిందే..