అప్పుడప్పుడు చేసే ఉపవాసంతో మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయాన్నే ఆరోగ్య నిపుణులే స్వయంగా చెబుతున్నారు. ప్రస్తుత మానవ ప్రపంచంలో మనిషిని వేధిస్తున్న గుండె జబ్బులకు ఉపవాసంతో చెక్ పెట్టవచ్చంట. శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగానే ఇలా జరుగుతుండగా.. ఫాస్టింగ్ అనేది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతూ ప్రమాదాన్ని నివారిస్తుంది. నచ్చిన సమయంలో అనుసరించే ఇలాంటి ఉపవాసం వల్ల కేవలం గుండె ఆరోగ్యమే కాకుండా ఇతర అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సమయానికి తిన్నా, తినకపోయినా.. వ్యాయామం చేసినా, చేయకపోయినా.. ఈ రోజుల్లో గుండె జబ్బు మరణాలు పెరుగుతున్నాయి. అందుకే తీసుకునే ఆహారం మూలంగా కొలెస్ర్టాల్ పేరుకుపోయి గుండెకు ప్రమాదం చేకూరకుండా ఉండేందుకు అడపా దడపా ఉపవాసం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇంకా దీని వల్ల బాడీలోని ఇన్సులిన్ హార్మోన్‌కు మన శరీరం స్పందించే విధానం మెరుగుపడుతుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్, అధిక బరువు, డయాబెటిస్ ప్రమాదాన్ని అరికడుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కేవలం సమయ పరిమితితో కూడిన ఆహారం. ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం ఒక పద్ధతి అయితే, ఉదయం 11 రాత్రి 8 గంటల వరకు మరో పద్ధతి. అలాగే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఒకసారి తింటూ ఉపవాసం ఉండటం కూడా చేయవచ్చు. మొత్తానికి 12 గంటల ఉపవాసమని గుర్తుంచుకోవాలి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..