Coronavirus: వామ్మో.. మాయదారి రోగం మళ్లీ విజృంభిస్తోంది. ఏడాదిలో అత్యధిక కేసులు ఈరోజే.

|

Apr 02, 2023 | 2:40 PM

ప్రపంచాన్ని వణికించిన మాయదారి రోగం కరోనా మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమవుతోందా.? రెండేళ్లుగా యావత్‌ మానవాళిని గడగడలాడించిన వైరస్‌ మళ్లీ దండ యాత్ర చేసేందుకు సిద్ధమవుతోందా.? అంటే తాజా గణంకాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది...

Coronavirus: వామ్మో.. మాయదారి రోగం మళ్లీ విజృంభిస్తోంది. ఏడాదిలో అత్యధిక కేసులు ఈరోజే.
Corona Virus
Follow us on

ప్రపంచాన్ని వణికించిన మాయదారి రోగం కరోనా మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమవుతోందా.? రెండేళ్లుగా యావత్‌ మానవాళిని గడగడలాడించిన వైరస్‌ మళ్లీ దండ యాత్ర చేసేందుకు సిద్ధమవుతోందా.? అంటే తాజా గణంకాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్‌ మరోసారి వేగంగా ప్రబలుతోంది. ఈ ఏడాది ఒక్కరోజులో అత్యధికంగా గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదుకావడం అందరినీ కలవరపరుస్తోంది.

గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 3824 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ 1,33,153 నమూనాలను పరీక్షించగా.. 3,823 మందికి వైరస్ నిర్దారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, మరో 1,784 మంది మహమ్మారి నుంచి కోలుకోగా… ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,41,73,335గా ఉంది. రికవరీల రేటు 98.72 శాతం కాగా.. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,369కి చేరింది.

ఇదిలా ఉంటే కోవిడ్‌ 19 రికవరీ రేటు 98.77 శాతంగా ఉండడం ఊరటనిచ్చే వార్తగా చెప్పొచ్చు. కోవిడ్‌ 19 బారిన పడి గడిచిన 24 గంటల్లో ఢిల్లీ, హ‌ర్యానా, కేర‌ళ‌, రాజ‌స్ధాన్‌లో ఒక్కొక్కరు చొప్పు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం క‌రోనా ప‌రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్‌ను ముమ్మ‌రం చేయాల‌ని రాష్ట్రాలు ఆదేశించాయి. ప‌లు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 న్యూ వేరియంట్ల‌ను ప‌సిగ‌ట్టేందుకు అన్ని పాజిటివ్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..