Moringa Leaves Benefits: మీ చుట్టుపక్కలే పెరుగుతున్న ఈ మొక్క ఆరోగ్య సమస్యలకు ఔషధాల నిధి.. పువ్వులు, కాయలు, ఆకులు అన్నీ అద్భుతమే..

|

Dec 02, 2022 | 12:38 PM

మునగాకును మధుమేహం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. విటమిన్లు, కాల్షియం, ఇనుము మరియు క్లిష్టమైన అమైనో ఆమ్లాలు ఇందులో సమృద్ధిగా లభించే పోషకాలు

Moringa Leaves Benefits: మీ చుట్టుపక్కలే పెరుగుతున్న ఈ మొక్క ఆరోగ్య సమస్యలకు ఔషధాల నిధి..  పువ్వులు, కాయలు, ఆకులు అన్నీ అద్భుతమే..
Moringa Leaves
Follow us on

మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు దేవుడు ప్రసాధించిన గొప్ప సంపద. ప్రకృతిలో లభించే మొక్కలు, పండ్లు, పూలు అన్నింటిలోనూ మనకు కావాల్సిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి మునగా కూడా. మునగ ఆకుల్లో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. మునగ ఆకుల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. మునగ ఆకుల్లో యాంటీట్యూమర్, యాంటిపైరేటిక్, యాంటీపైలెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటిస్పాస్మోడిక్, డైయూరిటిక్, యాంటీహైపెర్టెన్సివ్, యాంటీ డయాబెటిక్, హెపాటోప్రొటెక్టివ్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. మునగ ఆకులను కూరగా వండుకుని తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా ఆకులను ఎండబెట్టి పొడి చేసి తినవచ్చు. ఆయుర్వేదంలో ఈ ఆకులను అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.

ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుతూ ఉంటే ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ కలుపుకుని తాగితే మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతాయి. ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుతూ ఉంటే క్రమంగా రేచీకటి తగ్గుముఖం పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మునగాకు రసంలో నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరిగించి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాస్తే ఫలితం ఉంటుంది.

మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలు, బెణుకు నొప్పుల పైన వేసి కట్టుకడితే నొప్పుల బాధలు తగ్గిపోతాయ్‌. మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు తగ్గి,ముఖచర్మం మృదువుగా మారుతుంది. మునగాకును మధుమేహం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. విటమిన్లు, కాల్షియం, ఇనుము మరియు క్లిష్టమైన అమైనో ఆమ్లాలు మొక్కలో సమృద్ధిగా లభించే పోషకాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి