Walking Benefits: ప్రతిరోజూ ఇంత దూరం వాకింగ్ చేస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఊహించరు!

| Edited By: Ravi Kiran

Nov 03, 2023 | 8:35 AM

చాలా మందికి ప్రతి రోజూ వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. ఏదో ఒక పార్కులో లేదా రోడ్డు మీద కొంత దూరం వరకూ నడుస్తూ ఉంటారు. ఇంకొంత మంది ఇంత సమయం అని పెట్టుకుంటారు. ప్రతి రోజూ వాకింగ్ చేయడం మంచి అలవాటే కానీ. ఎంత సేపు నడవాలి అనేది మాత్రం తెలీదు. ఈ విషయంలో పలు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ప్రతి రోజూ ఎంత సేపు వాకింగ్ చేస్తే మంచిది అని. అయితే ప్రతి రోజూ 8 వేల అడుగుల దూరం నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనం..

Walking Benefits: ప్రతిరోజూ ఇంత దూరం వాకింగ్ చేస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఊహించరు!
Walking
Follow us on

చాలా మందికి ప్రతి రోజూ వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. ఏదో ఒక పార్కులో లేదా రోడ్డు మీద కొంత దూరం వరకూ నడుస్తూ ఉంటారు. ఇంకొంత మంది ఇంత సమయం అని పెట్టుకుంటారు. ప్రతి రోజూ వాకింగ్ చేయడం మంచి అలవాటే కానీ. ఎంత సేపు నడవాలి అనేది మాత్రం తెలీదు. ఈ విషయంలో పలు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ప్రతి రోజూ ఎంత సేపు వాకింగ్ చేస్తే మంచిది అని. అయితే ప్రతి రోజూ 8 వేల అడుగుల దూరం నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. 8,000 అడుగులు వేయడం.. రోజుకు సుమారు 6.4 కిలో మీటర్లు నడవడానికి సమానమని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే నెమ్మదిగా నడవడం కంటే వేగంగా నడవడం వల్లే మంచిదని పరిశోధకులు కూడా నిరూపించారు. అయితే ఒక్కసారే ఎక్కువ దూరం నడవకూడదు. క్రమ క్రమంగా మీరు నడిచే దూరాన్ని పెంచుకోవాలి. ఇలా నడవడం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎమోషనల్ కంట్రోల్:

ప్రతి రోజూ సరైన విధంగా వాకింగ్ చేయడం వల్ల భావోద్వేగ నియంత్రనకు సహాయ పడుతుంది. తమ ఆలోచనలకు, భావాలకు తీర్పు ఇవ్వకుండా గమనించగలిగితే వారి భావోద్వేగాలను మరింత సమర్థవంతంగా గ్రహించగలరు.

ఇవి కూడా చదవండి

ఏకాగ్రత పెరుగుతుంది:

డైలీ వాకింగ్ చేయడం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం మెరుగవుతుంది. అలాగే ప్రశాంతతను పెంపొందించడంలో కూడా సహాయ పడుతుంది.

నిద్ర నాణ్యత పెరుగుతుంది:

ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా నిద్ర అనేది సరిగా పట్టడం లేదు. అనేక ఆలోచనలు, ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. దీంతో ఒత్తిడి తగ్గి.. ఇతర విషయాలపై ఏకాగ్రత పెరుగుుతంది.

గుండెకు మంచిది:

ప్రతి రోజూ ఉదయం వాకింగ్ చేయడం వల్ల గుండెకు చాలా మంచిది. గుండె జబ్బులు ఏమైనా ఉన్నా అదుపులోకి వస్తాయి. అలాగే ప్రశాంతంగా ఉంటుంది. గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలను నుండి గుండెను కాపాడుకోవచ్చు.

వెయిట్ కంట్రోల్:

డైలీ వాకింగ్ చేయడం వల్ల హెల్దీగా, ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు. అధిక బరువుతో బాధ పడేవారికి వాకింగ్ చాలా బెస్ట్ ఆప్షన్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.