Silk Saree Cleaning Tips: ఈ చిట్కాలను పాటిస్తే.. పట్టు చీరలకు డ్రై క్లీనింగ్ అక్కర్లేదు!!

|

Sep 01, 2023 | 4:54 PM

మారుతున్న కాలంతో మనం కూడా మారిపోతున్నామని అనుకుంటాం కానీ.. ఎన్ని రకాల డ్రస్సులు, లెహంగాలు, లంగా ఓణీలున్నా.. పట్టు చీరల ముందు అవన్నీ దిగదుడుపే. ప్రత్యేక ఫంక్షన్లు, పెళ్లిళ్లలో.. పట్టు చీరలను కట్టాల్సిన పద్ధతిలో కట్టుకుంటే.. ఆడవారిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అంత అందంగా కనిపిస్తారు. మగువల అందాన్ని పట్టు చీరలు మరింత రెట్టింపు చేస్తాయి. కానీ ఒకటి, రెండుసార్లు కట్టుకోగానే అవి మురికి పట్టేస్తాయి. సాధారణ చీరలను ఉతికినట్టుగా పట్టు..

Silk Saree Cleaning Tips: ఈ చిట్కాలను పాటిస్తే.. పట్టు చీరలకు డ్రై క్లీనింగ్ అక్కర్లేదు!!
Silk Saree Cleaning Tips
Follow us on

మారుతున్న కాలంతో మనం కూడా మారిపోతున్నామని అనుకుంటాం కానీ.. ఎన్ని రకాల డ్రస్సులు, లెహంగాలు, లంగా ఓణీలున్నా.. పట్టు చీరల ముందు అవన్నీ దిగదుడుపే. ప్రత్యేక ఫంక్షన్లు, పెళ్లిళ్లలో.. పట్టు చీరలను కట్టాల్సిన పద్ధతిలో కట్టుకుంటే.. ఆడవారిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అంత అందంగా కనిపిస్తారు. మగువల అందాన్ని పట్టు చీరలు మరింత రెట్టింపు చేస్తాయి. కానీ ఒకటి, రెండుసార్లు కట్టుకోగానే అవి మురికి పట్టేస్తాయి. సాధారణ చీరలను ఉతికినట్టుగా పట్టు చీరలను ఉతకడం సాధ్యం కాదు. డ్రైక్లీనింగ్ కు ఇవ్వాలంటే.. చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇంట్లోనే కొన్ని సింపుల్ టిప్స్ తో పట్టుచీరలను మీరే శుభ్రం చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.. డబ్బు ఆదా చేసుకోండి.

ఫస్ట్ చీరను ఉతకాలా.. డ్రై క్లీనింగ్ ఇవ్వాలో తెలుసుకోండి:

పట్టు చీరను ఒకసారి కట్టిన తర్వాత కంటే నాలుగైదు సార్లు కట్టుకున్న తర్వాత ఉతకడం మంచిది. చీరను ఉతకాలనుపుడు దానిపై ఉండే లేబుల్ ను సరిగ్గా చదవాలి. డ్రైక్లీనింగ్ చేయాలా లేదా మామూలుగా ఉతికినా సరిపోతుందా అనేది దానిపై ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పట్టు చీరలను చల్లటి నీటితోనే క్లీన్ చేసుకోవాలి:

పట్టుచీరల్ని క్లీన్ చేసేటపుడు చల్లటి నీటినే వాడాలి. వేడి నీరు వాడితే చీర రంగు మొత్తం వెలసిపోయే అవకాశం ఉంది. చల్లటినీటిలో చీరను కొద్దిసేపు నానబెట్టాక సున్నితంగా ఉతకాలి.

వెనిగర్ తో శుభ్రం చేసుకోండిలా:

పట్టుచీరను నీటిలో నానబెట్టిన తర్వాత.. ఒక బకెట్ లో నీరు తీసుకుని అందులో 2 స్పూన్ల వైట్ వెనిగర్ ను కలపాలి. అందులో పట్టుచీరను 10 నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేస్తే చీరపై మరకలు పోతాయి.

పట్టు చీరలను పిండకూడదు:

పట్టుచీరను ఉతికిన తర్వాత దానిని గట్టిగా పిండకూడదు. నీరు జారిపోయేంతవరకూ అలాగే ఉంచి.. ఆ తర్వాత నీడలో చీరను ఆరబెట్టాలి. ఎండ తగిలితే చీర మెరుపు పోతుందని గుర్తుంచుకోండి.

పట్టు చీరలను ప్రత్యేకంగా ఉతకాలి:

పట్టు చీరలను సాధారణ చీరలతో కలిపి ఉంచకూడదు. వాటిని ప్రత్యేక ప్రదేశంలో ఉంచి.. కాటన్ క్లాత్ తో కవర్ చేసి ఉంచాలి. ఈ టిప్స్ పాటిస్తే.. మీ పట్టుచీరలు ఎప్పటికీ సురక్షితంగా కొత్తవాటిలా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి