AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benifits With Eggs: శీతాకాలంలో గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా.. ఎగ్స్‌లో ఉండే పోషకాలు ఇవే..

కోడిగుడ్లలో పోషకాలుంటాయని మనందరికి తెలుసు. చాలా మంది తమ పిల్లలకు రోజూ ఉడకబెట్టిన గుడ్లను పెడుతుంటారు. శాఖహరులు కూడా కొంతమంది ఆరోగ్యం కోసం కోడిగుడ్డును తింటుంటారు. శీతాకాలంలో సాధారణంగా..

Benifits With Eggs: శీతాకాలంలో గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా.. ఎగ్స్‌లో ఉండే పోషకాలు ఇవే..
Eggs
Amarnadh Daneti
|

Updated on: Dec 03, 2022 | 6:01 AM

Share

కోడిగుడ్లలో పోషకాలుంటాయని మనందరికి తెలుసు. చాలా మంది తమ పిల్లలకు రోజూ ఉడకబెట్టిన గుడ్లను పెడుతుంటారు. శాఖహరులు కూడా కొంతమంది ఆరోగ్యం కోసం కోడిగుడ్డును తింటుంటారు. శీతాకాలంలో సాధారణంగా రోగనిరధక శక్తి తక్కువుగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడంతో పాటు.. మనిషి ఆరోగ్యం కోసం తగిన నియమాలు పాటించాలి. కోడిగుడ్లు సాధారణంగా రకాల విటమిన్లు, ఖనిజ పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. శీతాకాలంలో గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఇదొక ఔషదంలా పనిచేస్తుందంటున్నారు. డీకిన్ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషన్ పరిశోధకులు చల్లని వాతావరణంలో రోజుకో గుడ్డు తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయవచ్చని కనుగొన్నారు. ఒక గుడ్డులో 8.2 ఎంసిజి విటమిన్ డి ఉంటుందని తెలిపారు.

గుడ్లలో పుష్కలంగా ప్రొటీన్లు

చాలా మందికి తెలిసినట్లుగా, గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, మధ్యస్థ గుడ్డులో 6 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షించడానికి అవసరమైన ప్రతిరోధకాలను తయారు చేయడానికి ప్రోటీన్లను శరీరం ఉపయోగిస్తుంది. దీనితో పాటు గుడ్లు తినడం వల్ల కండరాల బలహీనత తగ్గుతుంది. నరాల వీక్‌నెస్‌తో బాధపడేవారు శీతాకాలంలో కోడిగుడ్లు తీసుకోవడం ఉత్తమం.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

గుడ్లు తినడం వల్ల హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. గుండె జబ్బులతో సహా ప్రాణాంతక గుండె జబ్బుల ప్రమాదాన్ని గుడ్లు తగ్గిస్తాయి. అలాగే గుడ్లలో జింక్ ఉంటుంది, ఇది సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..