AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Groundnut-Beetroot: శనగపిండి-బీట్ రూట్ తో ఇలా చేస్తే.. మీ చర్మం మెరవడం ఖాయం

ఉరుకుల పరుగుల జీవితం. అంతా హడావిడి. ట్రాఫిక్ లో ఆఫీసులు, కాలేజీలకు వెళ్లి.. ఇంటికొచ్చేసరికి.. ఆ పొల్యూషన్ లో చర్మంపై మృత కణాలు పేరుకుపోతాయి. అది టాన్ గా మారి చర్మం నల్లబడుతుంటుంది. దానిని క్లీన్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లాలి. కానీ..

Groundnut-Beetroot: శనగపిండి-బీట్ రూట్ తో ఇలా చేస్తే.. మీ చర్మం మెరవడం ఖాయం
Beetroot
Chinni Enni
|

Updated on: Jul 25, 2023 | 5:33 PM

Share

ఉరుకుల పరుగుల జీవితం. అంతా హడావిడి. ట్రాఫిక్ లో ఆఫీసులు, కాలేజీలకు వెళ్లి.. ఇంటికొచ్చేసరికి.. ఆ పొల్యూషన్ లో చర్మంపై మృత కణాలు పేరుకుపోతాయి. అది టాన్ గా మారి చర్మం నల్లబడుతుంటుంది. దానిని క్లీన్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లాలి. కానీ.. ఈ మిశ్రమాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే ఇక ఇంటివద్దే టాన్ ను తొలగించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో చూద్దాం.

రెండు – మూడు బీట్ రూట్ లను తీసుకుని.. వాటి తొక్కలు తీసేసి.. సన్నగా కోరు తీసుకోవాలి. అలా తరిగిన బీట్ రూట్ ను పూర్తిగా ఎండేంత వరకూ రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టాలి. తడిలేకుండా పూర్తిగా ఎండిన బీట్ రూట్ పొడిని సాఫ్ట్ గా అయ్యేంత వరకూ చేతితో నలపాలి. ఇప్పుడీ బీట్ రూట్ పొడికి రెండింతలు సమంగా శనగపిండిని తీసుకుని అందులో కలుపుకోవాలి.

దీనిని ఒక గాజు సీసాలో(గాజు సీసానే ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుంది) భద్రపరచుకోవాలి.ప్రతిరోజు రాత్రి స్నానం చేశాక.. రెండు మూడు స్పూన్ల ఈ మిశ్రమంలో రోజ్ వాటర్ లేదా మామూలు నీరు కలిపి.. ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

డ్రై స్కిన్ ఉన్నవారు రోజ్ వాటర్ బదులు పాలను వాడటం మంచిది. క్లీన్ చేసిన వెంటనే సబ్బు, బాడీ లోషన్, మాయిశ్చరైజర్ వంటివి వాడకూడదు. లేదంటే స్నానం చేసే ముందే శరీరానికి నలుగులా పెట్టుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చేస్తే మీ చర్మసౌందర్యం పెరగడంతో పాటు.. ముఖం కూడా కాంతివంతంగా ఉంటుంది. ముఖం, మెడ, చేతులపై పేరుకున్న టాన్ తొలగిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

Follow Us
స్టేడియంలో చెప్పుల వర్షం.. అభిమానుల మధ్య ముష్టియుద్ధం
స్టేడియంలో చెప్పుల వర్షం.. అభిమానుల మధ్య ముష్టియుద్ధం
10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..
10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే