
ఈ మధ్యకాలంలో యువతలో ఎక్కువగా కడుపులో గ్యాస్ సమస్య బాధపెడుతోంది. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, వేళా పాళా లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. మీరు అలాంటి గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మీరు గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అలాంటి ఐదు హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం ?
1. వాము రసం వాడకం ఉపశమనం ఇస్తుంది:
వాము గింజలలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది గ్యాస్ట్రిక్ రసాలను స్రవిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. గ్యాస్ సమస్యలో, మీరు అర టీస్పూన్ వాము గింజలను నీటిలో ఉడికించి ఆ నీరు తాగవచ్చు. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది.
2. జీలకర్ర నీరు సర్వరోగ నివారిణి:
గ్యాస్ట్రిక్ లేదా గ్యాస్ సమస్యకు జీలకర్ర నీరు బెస్ట్ హోం రెమెడీగా చెప్పవచ్చు. జీలకర్రలో ముఖ్యమైన రసాయనాలు ఉంటాయి. ఇవి లాలాజల గ్రంథులను ప్రేరేపిస్తాయి. దీని వల్ల ఆహారం మాత్రం బాగా జీర్ణమవుతుంది. ఇది పొట్టలో అదనపు గ్యాస్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీలకర్ర టీ తయారు చేయడానికి ఒక టీస్పూన్ జీలకర్ర తీసుకుని రెండు కప్పుల నీటిలో 10-15 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు చల్లారనిచ్చి భోజనం తర్వాత తాగాలి.
3. ఇంగువను నీటిలో కలిపి త్రాగాలి:
అర టీస్పూన్ ఇంగువను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే కడుపులో గ్యాస్ ఏర్పడటం తగ్గుతుంది. గ్యాస్ నుండి తక్షణ ఉపశమనం అందించడంలో ఇంగువ ఉపయోగపడుతుంది. ఇది కడుపుని శుభ్రపరుస్తుంది. గ్యాస్ నుండి ఉపశమనం పొందుతుంది.
4. అల్లం గ్యాస్ ను తొలగిస్తుంది:
అల్లం అనేక వ్యాధుల నివారణలో ఉపయోగిస్తుంటారు. కడుపులోని గ్యాస్‌ను తొలగించడానికి మీరు తాజా అల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. కడుపులో గ్యాస్ నుండి ఉపశమనం పొందడానికి మీరు అల్లం టీ తాగవచ్చు. జింజర్ టీ అంటే మిల్క్ టీ కాదు. కడుపులో గ్యాస్ నుండి ఉపశమనం పొందడానికి, తాజా అల్లం ముక్కలను ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. కాస్త వేడి వేడిగా తాగండి.
5. బేకింగ్ సోడా, నిమ్మరసం త్రాగాలి:
ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ బేకింగ్ సోడా కలుపుకుని తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కడుపులోని గ్యాస్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..