Immunity: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నట్లే.. తస్మాత్ జాగ్రత్త

|

Sep 25, 2022 | 9:00 AM

Immunity System: రోగనిరోధక శక్తి బాగుంటే ఆరోగ్యంగా ఉంటాం. లేకుంటే ప్రతిసారీ అనారోగ్యానికి గురవుతాం. బయట భోజనం చేయడం, వర్షంలో తడవడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు.

Immunity: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నట్లే.. తస్మాత్ జాగ్రత్త
Immune System
Follow us on

Immunity System: రోగనిరోధక శక్తి బాగుంటే ఆరోగ్యంగా ఉంటాం. లేకుంటే ప్రతిసారీ అనారోగ్యానికి గురవుతాం. బయట భోజనం చేయడం, వర్షంలో తడవడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కొందరు మాత్రం ఏం తిన్నా ఆరోగ్యంగా ఉంటారు. దీనికి రోగనిరోధక శక్తే కారణం. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా ఉంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవు. అయితే ప్రస్తుతం చాలా మంది రోగనిరోధక శక్తిలోపంతో బాధపడుతున్నారు. మరి మన ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉందని ఎలా తెలుసుకోవాలి? అయితే మన శరీరంలో కొన్ని లక్షణాలను పసిగట్టడం ద్వారా ఈ విషయాన్ని పసిగట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు. మరి ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

తరచూ జ్వరం, చలి

మీకు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తరచూ తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, ప్రమాదకరమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు శరీరంపై దాడి చేస్తాయి. ఈ కారణంగా, తరచుగా జ్వరం, చలి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉదర సమస్యలు

రోగనిరోధక వ్యవస్థ మన జీవన వ్యవస్థకు సంబంధించినది. మీరు అతిసారం, అపానవాయువు, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటే, అది బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతం. ఇలా తరచూ కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

నీరసం, అలసట

శరీరంలో బద్ధకం లేదా అలసట భావన బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతం. శరీరం ఎప్పుడూ వ్యాధికారక క్రిములతో పోరాడుతూనే ఉంటుంది. అందువల్ల శక్తి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వారు ప్రతిసారీ అలసిపోయి, నీరసంగా ఉంటారు. బలహీనమైన రోగనిరోధక శక్తి అలసట, నీరసానికి దారితీస్తుంది.

మానని గాయాలు

శరీరంలో ఏదైనా గాయం త్వరగా మానకపోవడం కూడా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు సంకేతం. శరీరంలో రోగనిరోధక శక్తి బాగా లేకుంటే గాయం త్వరగా మానదు. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే గాయం అంత వేగంగా మానుతుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలనైనా వైద్యుల సలహా, సూచనలు తీసుకున్న తర్వాతే ఫాలో కావాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..