Monsoon Precautions: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే!!

| Edited By: TV9 Telugu

Jul 25, 2023 | 1:47 PM

వేసవికాలం పూర్తయి.. వర్షాకాలం మొదలవ్వడంతో వాతావరణంలో జరిగే మార్పులతో పాటు మన శరీరంలోనూ మార్పులొస్తాయి. ఈ సీజన్లో వర్షాలు పెరిగే కొద్దీ.. అంటువ్యాధుల సమస్య కూడా పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం ప్రధానంగా కనిపించే అనారోగ్యం. ఇవి కాకుండా డెంగ్యూ..

Monsoon Precautions: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే!!
Monsoon
Follow us on

వేసవికాలం పూర్తయి.. వర్షాకాలం మొదలవ్వడంతో వాతావరణంలో జరిగే మార్పులతో పాటు మన శరీరంలోనూ మార్పులొస్తాయి. ఈ సీజన్లో వర్షాలు పెరిగే కొద్దీ.. అంటువ్యాధుల సమస్య కూడా పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం ప్రధానంగా కనిపించే అనారోగ్యం. ఇవి కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కూడా ప్రబలుతుంటాయి. ఇవి వ్యాపించకుండా ఉండాలంటే.. ముందు మన చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. మన చుట్టూ పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి.

ప్రతిరోజూ నాణ్యమైన ఫ్లోర్ క్లీనర్ తో ఇంటిని శుభ్రం చేసుకోవడం, వీలైతే వేడినీటితో ఇంటిని శుభ్ర పరచడం వంటివి చేయాలి. అప్పుడే చిన్న పిల్లలకు త్వరగా అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. దుస్తుల్ని కూడా వేడినీటిలో శుభ్రపరచడం మంచిది. భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదలతో.. త్రాగునీరు అపరిశుభ్రంగా, మురికిగా వస్తుంది. చూడటానికి త్రాగునీరే అయినా కంటికి కనిపించని సూక్ష్మక్రిములు వాటిలో ఉంటాయి.

ఖచ్చితంగా నీటిని కాచి, చల్లార్చి వడబోసి త్రాగడం ఉత్తమం. పిల్లలకు కూడా ఈ నీటినే తాగించాలి. లేదంటే కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. బయట దొరికే పానీపూరి వంటి చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. వాటిలో వాడే నీరు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పిల్లలకు శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్), నిల్వఉంచిన ఐస్ క్రీమ్ లు తినే అలవాట్లు చేయకూడదు.

ఇవి కూడా చదవండి

వీటి కారణంగా జలుబు.. ఆ తర్వాత జ్వరం వచ్చే అవకాశాలెక్కువగా ఉంటాయి. వీలైనంత వరకూ ఆహారాన్ని వేడిగానే తినాలి. వారానికి రెండుసార్లైనా పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగాలి.. పిల్లలకూ తాగించాలి. పసుపు కలిపిన పాలు యాంటీబయాటిక్ గా పనిచేస్తాయి. ఆరోగ్యానికి హానిచేసే క్రిములను పసుపులో ఉండే యాంటీ బయోటిక్స్ నివారిస్తాయి. ప్రతిరోజూ తినే ఆహారంలో ఆకుకూరలు, ఆకుపచ్చగా ఉండే కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..