Sneezing: తరచూ తుమ్ములతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..

|

Jan 14, 2022 | 3:54 PM

Sneezing Problem Remedies: శీతాకాలంలో దగ్గు, జలుబు లాంటి సమస్యలు సర్వసాధారణం. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు, ఫ్లూ, వైరస్‌లు

Sneezing: తరచూ తుమ్ములతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..
Sneezing
Follow us on

Sneezing Problem Remedies: శీతాకాలంలో దగ్గు, జలుబు లాంటి సమస్యలు సర్వసాధారణం. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు, ఫ్లూ, వైరస్‌లు చుట్టుముడుతుంటాయి. అయితే.. చలికాలంలో మరో సమస్య కూడా చాలామందిని వేధిస్తుంటుంది.. తుమ్ములు తరచూ రావడం. అయితే ఈ సమస్య చలికాలంలో (Winter) సాధారణంగా మారుతుంది. శీతాకాలంలో తరచుగా తుమ్ములు వస్తుండటంతో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తరుచూ తుమ్ములు (Sneezing Problem) వస్తుండడం వల్ల తమ పనిపై ఏకాగ్రత పెట్టలేక తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారు. అంతే కాదు తలనొప్పి సమస్య కూడా మొదలవుతుంది. సైనస్ వంటి అనారోగ్యం కూడా ఒక కారణం కావచ్చు. ముక్కులో ఎముక పెరగడం వల్ల జలుబు లేదా తరచుగా తుమ్ములు వస్తూనే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. సైనస్ వల్ల కూడా ముక్కు కారడం మొదలవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని వదిలించుకోవడానికి శస్త్రచికిత్స మాత్రమే మార్గం.

అయినప్పటికీ, చాలా మంది ఈ సమస్యను తొలగించుకోడానికి లేదా ఉపశమనం పొందడానికి మందుల సహాయం కూడా తీసుకుంటారు. ఈ మందులు వారికి ఉపశమనాన్ని ఇస్తాయి.. కానీ అవి శరీరంలోని ఇతర భాగాలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఈ సమస్య పరిష్కారానికి అనేక హోం రెమిడీస్ ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా తరచుగా తుమ్ములు రావడాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ హోం రెమెడీస్ (Health Tips) ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిట్కాలు.
ఉప్పు నీరు
నిరంతరం తుమ్ముల సమస్య ఉన్నవారు రాళ్ల ఉప్పు నీటిని వినియోగించాలి. ఇది వారికి చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ నిటీని కొద్దిరోజుల పాటు సేవించినా పుక్కలించినా ఈ సమస్య బారి నుంచి ఉపశమనం పొందవచ్చు.

వేడి నీరు
అలాగే.. ఎలర్జీ సమస్య ఉన్నవారు కూడా పదే పదే తుమ్ముతుంటారు. అలాంటి వారికి వేడి నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం కాస్త వేడెక్కుతుంది. దీంతోపాటు ఉదరానికి సంబంధించిన సమస్యలు కూడా మీకు దూరమవుతాయి.

నల్ల మిరియాలు
అలర్జీ సమస్య ఉన్నవారు నల్లమిరియాలు తీసుకోవాలి. దీనికోసం కొద్దిగా నల్ల మిరియాల పొడిని తీసుకుని, తులసి ఆకులతో కలిపి నమలాలి. అలాకాకపోతే.. తులసి, నల్లమిరియాలతో చేసిన టీని కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ప్రాచీన కాలం నుంచి ఈ రెసిపీ అనేక వ్యాధులను నయం చేయడానికి ఉత్తమమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆవిరి పట్టండి..
వేడి నీటి ఆవిరిని తీసుకోవడం ద్వారా కూడా తుమ్ములు రావడాన్ని ఆరికడుతుంది. దీని ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. అయితే.. ఆవిరి పట్టడం వల్ల చర్మానికి మేలు చేకూరి తళతళ మెరుస్తుంది. తరచుగా వచ్చే తుమ్ముల సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధపెడుతుంటే, ఖచ్చితంగా రోజుకు ఒకసారి ఆవిరి పట్టాలని సూచిస్తున్నారు నిపుణులు.

Also Read:

Indian Passport: పాస్‌పోర్టు ఉన్న భారతీయులకు గుడ్‌న్యూస్.. వీసా లేకున్నా, 59 దేశాలకు ప్రయాణం!

Snake Massage Centre: ఆ దేశంలో రిలాక్స్ కోసం వంటిపై నూలు పోగులేకుండా.. కొండచిలువలతో మసాజ్