Health: హైబీపీని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు

|

Feb 12, 2024 | 11:51 AM

అయితే హైపర్‌ టెన్షన్‌ను ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. హైపర్‌ టెన్షన్‌ కారణంగా వచ్చే రక్తపోటు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. హైపర్‌ టెన్షన్‌ వల్ల మెదడులో రక్త ప్రసరణ తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది...

Health: హైబీపీని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు
BP Control Tips
Follow us on

హైపర్ టెన్షన్‌ ప్రతీ మనిషి ఎదుర్కొనే సహజమైన లక్షణం. ఏదైనా భయానికి గురికావడమో లేదా ఆతృత వంటి సమయాల్లో హైపర్ టెన్షన్‌ వేధిస్తుంటుంది. దీంతో శరీరంలో ఉన్నపలంగా రక్తపోటు పెరుగుతుంది. ఈ సమయంలో శరీరం రక్తాన్ని పంప్‌ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీంతో రక్త నాణాలపై ఒత్తిడి పెరగడం వల్ల గుండె కండరాలు బలహీనపడతాయి. దీంతో శరీరంలో రక్తప్రసరణ మందగిస్తుంది. ఇది శరీరంలో ఆక్సిజన్‌ కొరతకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇదే గుండెపోటుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే హైపర్‌ టెన్షన్‌ను ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. హైపర్‌ టెన్షన్‌ కారణంగా వచ్చే రక్తపోటు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. హైపర్‌ టెన్షన్‌ వల్ల మెదడులో రక్త ప్రసరణ తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. రక్తపోటు ఆకస్మాత్తుగా పెరిగితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు పెరుగుతుంది. అందుకే అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు.

అయితే రక్తపోటును కొన్ని రకాల లక్షణాల ద్వారా ముందుగానే గుర్తుపట్టొచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే.. శరీరంలో రక్తపోటు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఛాతీలో నొప్పగా ఉండడం, ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది.అంతేకాకుండా మనసులో ఏదో తెలియన దడ దడ భావం కలుగుతోన్నా దానికి రక్తపోటు కారణంగా చెప్పొచ్చు. రక్తపోటు అధికంగా పెరిగితే.. కంటి చికాకు, నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో రక్తపోటు పెరిగితే జీర్ణ క్రియలోనూ ఇబ్బందులు ఏర్పడుతాయి.

ఇంతకీ రక్తపోటును ఎలా నియంత్రించాలంటే.. ఒకవేళ మీకు హైబీపీ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి. ప్రతీరోజూ కచ్చితంగా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే కచ్చితంగా కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. అలాగే.. అతిగా మద్యం సేవించవద్దు. అలాగే కచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల మంచి నీటిని తాగాలి. రోజు కనీసం అరగంట వ్యాయామం చేయాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..