Skin Care Tips: చర్మ సంరక్షణకు టీ ట్రీ ఆయిల్.. ఎలా వాడితే మంచిది?

|

Aug 18, 2023 | 6:30 PM

టీ ట్రీ ఆయిల్ (Tea Tree Oil).. పేరులో ఉన్నట్టే.. ఈ నూనెను టీ చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారు. కానీ ఇది మన దేశంలో లభించే టీ చెట్ల నుంచి కాకుండా.. ఆస్ట్రేలియాకు చెందిన టీ ట్రీ మొక్క బెరడు నుంచి తయారు చేస్తారు. ఈ ఆయిల్ వల్ల మన చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ తాగకూడదని గుర్తుంచుకోండి. మొటిమలు, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇలా అనేక రకాల వ్యాధుల్ని నివారిస్తుంది. టీ ట్రీ ఆయిల్ తో ఏయే చర్మ సమస్యలను..

Skin Care Tips: చర్మ సంరక్షణకు టీ ట్రీ ఆయిల్.. ఎలా వాడితే మంచిది?
Tea Tree Oil Benefits
Follow us on

టీ ట్రీ ఆయిల్ (Tea Tree Oil).. పేరులో ఉన్నట్టే.. ఈ నూనెను టీ చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారు. కానీ ఇది మన దేశంలో లభించే టీ చెట్ల నుంచి కాకుండా.. ఆస్ట్రేలియాకు చెందిన టీ ట్రీ మొక్క బెరడు నుంచి తయారు చేస్తారు. ఈ ఆయిల్ వల్ల మన చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ తాగకూడదని గుర్తుంచుకోండి. మొటిమలు, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇలా అనేక రకాల వ్యాధుల్ని నివారిస్తుంది. టీ ట్రీ ఆయిల్ తో ఏయే చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

యుక్త వయసులో యువతీయువకులను అధికంగా వేధించే సమస్య మొటిమలు. చర్మంపై పేరుకున్న జిడ్డు ఇందుకు ఒక కారణమైతే.. వయసు పరంగా మొటిమల సమస్య సాధారణంగా వస్తుంటుంది. మొటిమలను తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను వాడుతూ నానా తంటాలు పడుతుంటారు. టీ ట్రీ ఆయిల్ లో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా బాదంనూనె కలిపి ముఖానికి రాసి.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు నిదానంగా తగ్గిపోతాయి. మొటిమలను పెంచే బ్యాక్టీరియాలో టీ ట్రీ ఆయిల్ పోరాడుతుంది. అలాగే చర్మం నుంచి రిలీజ్ అయ్యే సెబమ్ ను తగ్గిస్తుంది.

మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: స్నానం చేసేటపుడు 10 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ముఖ్యంగా.. మూత్రవిసర్జన చేసే ప్రాంతంలో ఆ నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తే.. మూత్రాశయ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

శరీర దుర్వాసన ఉండదు: మనలో చాలామందికి శరీర దుర్వాసన వస్తుంటుంది. అధికంగా చెమట పట్టడమే ఇందుకు కారణం. బ్యాక్టీరియా శరీరంపై పేరుకుపోవడం వల్ల శరీరం దుర్వాసన వస్తుంటుంది. దానిని అధిగమించాలంటే.. స్నానం చేసే నీటిలో టీ ట్రీ ఆయిల్ ను 10-15 చుక్కలు కలిపి స్నానం చేయాలి. అలాగే చంకల కింద టీ ట్రీ ఆయిల్ లో బాదం నూనె కలిపి రాసి..15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే.. శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ ను దూరంగా ఉంచుతుంది: గోరుచుట్టును తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. టీ ట్రీ ఆయిల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఫంగస్ ను తొలగిస్తుంది. వేడి నీటిలో 2 టీస్పూన్ల పసుపు, రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి.. గోరుచుట్టు వేసిన వేళ్లను 20 నిమిషాలపాటు అందులో ఉంచితే.. ఉపశమనం కలుగుతుంది.

మౌత్ వాష్: ఒక కప్పు వేడినీటిలో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి.. ఉదయాన్నే మౌత్ వాష్ చేసుకుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ నీటిని పొరపాటున కూడా మింగకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

తామరకు చెక్: టీ ట్రీ ఆయిల్, కొబ్బరి నూనె, లావెండర్ ఆయిల్ సమాన పరిమాణంలో కలిపి స్నానానికి వెళ్లే ముందు తామర ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. తొలుత కాస్త మంటగా అనిపించినా.. తర్వాత తామర నుంచి ఉపశమనం పొందుతారు.

డ్రై స్కిన్ వారికి బెటర్ ఛాయిస్: ఒక టీ స్పూన్ బాదం నూనె, 5 టీ స్పూన్ల టీ ట్రీ ఆయిల్ కలిపి చర్మంపై రాసుకుని.. మర్దనా చేసుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేస్తే చాలు. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే.. మీ స్కిన్ హైడ్రేట్ గా ఉండటంతో పాటు కాంతివంతంగా కూడా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి