
వర్షాకాలం చల్లటి వాతావరణం మనకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ వర్షంతో పాటు కొన్ని ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు బాగా పెరుగుతాయి. వీటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. అందుకే దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
డెంగ్యూ అనేది Aedes aegypti అనే దోమ కాటు వల్ల వచ్చే వైరల్ ఫీవర్. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి నేరుగా వ్యాపించదు. కేవలం దోమ కాటు ద్వారా మాత్రమే వస్తుంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే చోట దోమలు ఎక్కువ కాబట్టి డెంగ్యూ వ్యాప్తికి ఇది ప్రధాన కారణం.
డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడటం చాలా ప్రమాదకరం. వెంటనే డాక్టర్ ను కలిసి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అలాగే ఈ జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూను నివారించవచ్చు.
చాలా మంది డెంగ్యూ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని అనుకుంటారు. అది తప్పు. ఇది కేవలం దోమ కాటు ద్వారానే వస్తుంది. అలాగే యాంటీబయోటిక్స్‌తో డెంగ్యూ నయమవుతుందని భావించడం కూడా పొరపాటే. డెంగ్యూకు ప్రత్యేక యాంటీబయోటిక్ ట్రీట్‌మెంట్ ఉండదు. డాక్టర్ సలహా ప్రకారం విశ్రాంతి తీసుకుని సరైన చికిత్స చేయించుకుంటేనే ఉపశమనం లభిస్తుంది.
వర్షాకాలం ఎంత అందంగా ఉన్నా.. మనం అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని కలవడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు పాటిస్తే డెంగ్యూ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.