Lip Care: కొబ్బరి నూనెతో ఇంట్లోనే లిప్ బామ్ ఈజీగా తయారు చేసుకోండిలా..!!

| Edited By: Ravi Kiran

Sep 09, 2023 | 9:30 PM

పెదవులు.. ఆడువారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. శరీర చర్మం కన్నా పెదవులు మరింత సున్నితంగా ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మెలనిన్ ఉత్పత్తి అధికమైనప్పుడు.. డీహైడ్రేషన్, ఎండ, దుమ్మూ, ధూళికి పెదవులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీంతో రంగు మారడం, పొడి బారడం, పగలడం వంటి జరుగుతాయి. వీటికి మంచి పోషణను అందించాలి. లేకపోతే పిగ్మంటేషన్ కు గురై నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇవి మళ్లీ జీవితంలో పోవు. బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో కూడా లిప్ బామ్ వంటివి రాసుకుంటూ ఉండాలి. ఇంట్లో కూడా లిప్ బామ్ వంటివి ఈజీగా తయారు..

Lip Care: కొబ్బరి నూనెతో ఇంట్లోనే లిప్ బామ్ ఈజీగా తయారు చేసుకోండిలా..!!
Lip Care
Follow us on

పెదవులు.. ఆడువారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. శరీర చర్మం కన్నా పెదవులు మరింత సున్నితంగా ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మెలనిన్ ఉత్పత్తి అధికమైనప్పుడు.. డీహైడ్రేషన్, ఎండ, దుమ్మూ, ధూళికి పెదవులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీంతో రంగు మారడం, పొడి బారడం, పగలడం వంటి జరుగుతాయి. వీటికి మంచి పోషణను అందించాలి. లేకపోతే పిగ్మంటేషన్ కు గురై నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇవి మళ్లీ జీవితంలో పోవు. బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో కూడా లిప్ బామ్ వంటివి రాసుకుంటూ ఉండాలి. ఇంట్లో కూడా లిప్ బామ్ వంటివి ఈజీగా తయారు చేసుకోవచ్చు.

కొబ్బరి నూనె (కోకోనట్ ఆయిల్) ని బ్యూటీ కేర్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె కేవలం జుట్టుకే కాదు.. చర్మానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. సాధారణంగానే కొబ్బరి నూనెలో న్యాచురల్ మాయిశ్చరైజర్ గుణాలు స్కిన్ ని తేమగా ఉంచుతుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఈ, కే చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. కొబ్బరి నూనె పెదవులను కూడా సంరక్షించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో ఇంట్లోనే ఈజీగా లిప్ బామ్ ను తయారు చేసుకోవచ్చు. ఇది పెదవులను మృదువుగా చేసి, తేమ ఉండేలా చూస్తుంది. కోకోనట్ ఆయిల్ తో చాలా రకాల లిప్ బామ్స్ చేసుకోవచ్చు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లిప్ బామ్-1:

ఇవి కూడా చదవండి

ఒక స్పూన్ పెట్రోలియం జెల్లీని పాన్ లో వేసి కరిగించాలి. ఆ తర్వాత దానికి ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయాలి. నెక్ట్స్ దీన్ని ఫ్రీజర్ లో స్టోర్ చేసుకుంటే.. గట్టిగా అవుతుంది. ఆ తర్వాత దీన్ని తీసుకుని హ్యాపీగా యూజ్ చేయవచ్చు.

లిప్ బామ్-2:

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో.. 5 చుక్కల జోజోబా ఆయిల్ వేసి బాగా కలపాలి. దీన్ని ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవాలి.

లిప్ బామ్-3:

ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో.. ఒక టేబుల్ స్పూన్ ఆలీవ్ ఆయిల్, కార్నాబా వ్యాక్స్ వేసి తక్కువ మంటపై కరిగించి బాగా కలపాలి. ఇది ఎయిర్ టైట్ బాక్స్ లోకి తీసుకుని ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు.

లిప్ బామ్-4:

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లో.. అర టేబుల్ స్పూన్ కార్నాబా వ్యాక్స్ వేసి చిన్న మంటపై వేడి చేయాలి. ఇది చల్లారిన తర్వాత అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్ లో వేసి ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి