ప్రతి ఒక్కరూ కష్టపడకుండా బరువు తగ్గాలని కోరుకుంటారు. నిద్రపోతున్నప్పుడు కూడా కొవ్వును తగ్గించవచ్చని తెలుసుకుందాం.. ఇది నమ్మలేకపోతున్నారా…. కానీ ఇది నిజానికి నిజం. దాల్చిన చెక్క ఒక పాత మసాలా వంట దినుసు.. దీనిని టీలో తాగడం ద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు ఇది అలసటను తొలగిస్తుంది. మంచి నిద్రకు కారణమవుతుంది. దాల్చినచెక్క టీ తాగడం ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో .. అది బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
చెట్టు బెరడు నుంచి వచ్చే దాల్చిన చెక్క… సువాసన వెదజల్లడమేకాదు… వంటల్లో ఇది హాట్ స్పైస్ కూడా. స్నాక్స్‌లో కూడా దీన్ని చల్లుకుంటారు. ఒకరకమైన టీలో ఈ పొడి కూడా కలుపుతారు. ఇక కాస్మొటిక్ ప్రొడక్ట్స్‌లో ఇది కామన్‌గా ఉంటుంది. పేస్టులు, సబ్బుల్లో దీని సువాసన మీకు వస్తూనే ఉంటుంది. వాసన కోసమే కాదు.. ఈ సుగంధ ద్రవ్యంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దాల్చినచెక్క మీ ఆహారంలో సుగంధాన్ని జోడించడంతో పాటు.. రుచిని కూడా పెంచుతుంది. మీరు కూరలు, చారు, షేక్స్, స్మూతీస్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. దాల్చినచెక్క ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంది. కనుక ఇది వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క సహజంగా ఇన్సులిన్ స్థాయిని నిర్వహించడానికి పనిచేస్తుంది. ఇది చక్కెర స్థాయిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఈ సుగంధ సుగంధ ద్రవ్యాలు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిటికెడు దాల్చిన చెక్క పొడి మీ గుండెకు మేలు చేస్తుంది. దీనిని నీరు, సలాడ్, సూప్‌లో కులపుకుని తాగండి. ఇలా చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఈ మసాలా దినుసులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్క టీ చేయడానికి ఒక పాత్రలో 2 కప్పుల నీరు, అర అంగుళం దాల్చినచెక్క, అర అంగుళం అల్లం తీసుకోండి. అప్పుడు అర టీస్పూన్ గ్రీన్ టీ జోడించండి. టీని వడకట్టి ఒక కప్పులో పోయండి. దానిలో ఒక చెంచా తేనె , నిమ్మరసం కలపండి.
ఇది కాకుండా మీరు కావాలంటే, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని రెండున్నర కప్పుల నీటిలో కలపండి. ఆ తర్వాత వడకట్టి నిమ్మరసం, తేనె కలపండి. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది నరాలను రిలాక్స్ చేయడానికి.. నిద్రను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి: Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..