Immunity: రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు

|

Feb 26, 2021 | 3:56 PM

Immunity: ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది అనారోగ్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముందే కరోనా కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి ..

Immunity: రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి..  వైద్య నిపుణులు ఏమంటున్నారు
Follow us on

Immunity: ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది అనారోగ్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముందే కరోనా కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి పెంచుకుంటే కరోనానే కాకుండా ఇతర వ్యాధులు దరి చేరకుండా కాపాడుకోగలుగుతాము. దాదాపు ఏడాదిగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విబృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. రోజురోజుకు వైరస్‌ దాడులు పెరిగిపోతుండటతంతో మానవునిలో నిరో నిరోధక శక్తి తగ్గి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినా.. నిర్లక్ష్యం చేస్తే మరింత వైరస్‌ విజృంభించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్త పెంచుకునే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. శక్తి లేకుంటే వైరస్‌ దాడి చేస్తే తట్టుకునే శక్తి ఉండదు. అందుకే ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల కొన్ని వైరస్‌లు మనపై దాడి చేయకుండా తట్టుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తితోనే కరోనా వైరస్‌ను ఎదుర్కొవచ్చు. ఇవి పాటిస్తే రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

1.ఒక చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో ఆయిల్‌ పుల్లింగ్‌ థెరపీ ప్రతీ రోజూ రెండుసార్లు చేయాలి. ఇలా చేసినట్లయితే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని ఆయుర్వేదం చెబుతోంది.

2. ప్రతీ రోజు ఫ్రీజ్‌ వాటర్‌, మామూలు వాటర్‌ తగకుండా కాస్త గోరువెచ్చని నీళ్లను తాగుతుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలుండవు.

3. ప్రతీ రోజు 30 నిమిషాల పాటు యోగాసనాలు చేస్తుండాలి. యోగ ద్వారా మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా రోగాలు దరిచేరవు. మనసు ప్రశాంతంగా ఉండటంతో శరీర అవయవాలపైన ఒత్తిడి పెరగకుండా ఉంటుంది.

4 వంటలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లిని తప్పకుండా వాడాలి. వాటి వల్ల నిరో నిరోధక శక్తి పెచే గుణాలు అధికంగా ఉంటాయి.

5. రోజూ పసుపు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. 150 మిల్లీ లీటర్ల పాలలో అరచెంచా పసుపు కలిపి ప్రతీ రోజు రెండు పూటలు తాగినట్లయితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

6. విటమిన్‌-సి అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే ఎంతో మంచిది. ఇవి వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. టమాట, బంగాళదుంప, నారింజ, నిమ్మ, కమల, కవి వంటి విటిలో విటమిన్‌ -సి అధికంగా ఉంటుంది.

7. సొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, తులసీ, డై గ్రేప్స్‌తో చేసిన టీ లేదా డికాక్షన్‌ రోజూ కనీసం రెండు సార్లు తాగినట్లతే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసం కలిపి తాగితే ఎంతో మేలు.

8. గొంతునొప్పి ఉన్నవారు, గొంతు పొడిబారినట్లయితే పుదీనా ఆకులు, వామ వాసన చూడాలి. ఇలా చేసినట్లయితే ఎంతో ఫలితం ఉంటుంది. లవంగాలు పొడి చేసుకుని చక్కెర, తేనెలో కలిపి ప్రతీ రోజు రెండు, లేదా మూడు సార్లు తాగాలి.

9. జలుబు ఉంటే ముక్కు రంధ్రంలోకి నువ్వుల నూనె, కొబ్బరి నూనె పూయాలి. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేయాలి.

10.వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, ఆకు కూరలు, మునగాకు ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Also Read: Red Banana Benefits: ఎర్ర అరటి పండు రోజుకొకటి తింటే చాలు.. ఆస్పత్రికి వెళ్లాల్సిన పనే ఉండదు..!