Food Digest: ప్రస్తుతమున్న కాలంలో ఎంతో మందికి వివిధ రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కొన్ని టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు అనేక రకాల పదార్థాలను తింటారు. ప్రతి ఆహారం వివిధ రకాల రుచిని కలిగి ఉంటాయి. అయితే కొన్ని పదార్థాలు సులభంగా జీర్ణం అవుతాయి.. కొన్ని పదార్థాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అయితే రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి సమయాల్లో త్వరగా జీర్ణం అయ్యే పదార్ధాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఆహారం జీర్ణం కావడానికి సగటు ఎంత సమయం పడుతుందో చూద్దాం.
డ్రై ఫ్రూట్స్:
మీరు పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ వంటి అధిక కొవ్వు విత్తనాల గురించి తెలిసే ఉంటుంది. ఇవి తింటే కేవలం 60 నిమిషాల్లోనే జీర్ణం అవుతాయి. అలాగే బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు మొదలైనవి జీర్ణం అయ్యేందుకు కొంత సమయం పడతుంది.
ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు:
ప్యాకింగ్ చేసిన ఆహారపదార్థాలలో ఫ్యాట్, సోడియం తదితరాలు ఎక్కువగా ఉండటంతో ఇలా ఉంచిన మాంసం వంటి పదార్థాలు జీర్ణం అయ్యేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.
ఫ్రూట్ షేక్స్..
మీరు వేర్వేరు రకాల ఫ్రూట్ షేక్స్ వంటివి జీర్ణం కావడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అవి 20-30 నిమిషాల్లోనే జీర్ణం అవుతాయి.
కూరగాయలు:
కూరగాయలు అనేక రకాలు ఉంటాయి. దోసకాయ, టొమాటో, ముల్లంగి మొదలైన నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయి. ఇవి తిన్న తర్వాత 30-40 నిమిషాలలో జీర్ణం అవుతాయి. మరో వైపు బ్రోకలి, క్యాబేజీ ఇతర వండిన ఆకుకూరలు జీర్ణం కావడానికి 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. ఇవి కాకుండా బత్తాయి, క్యారెట్, బిట్‌రూట్ జీర్ణం కావడానికి 50-60 నిమిషాల పాటు సమయం పడుతుంది. అలాగే పలాన్, మొక్కజొన్న, బంగాళదుంపలు జీర్ణం కావడానికి 60 నిమిషాలు పడుతుంది.
ఇవి కూడా చదవండి: