Eggs: రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది..! ఎక్కువ తింటే ఏమౌతుంది..?

|

Jan 02, 2023 | 8:43 AM

గుడ్లలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుందని మీకు తెలుసా? ఈ సూక్ష్మక్రిములు మీ శరీరంలోకి ప్రవేశించి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇది

Eggs: రోజుకు ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిది..! ఎక్కువ తింటే ఏమౌతుంది..?
వారి ప్రకారం కొన్ని రకాల వ్యాధులలో బాధపడేవారు గుడ్లు తినడం చాలా హానికరం. చాలా మంది ప్రజలు చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లు తింటారు. కొన్నిసార్లు వాటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది వారి శరీరానికి హాని కలిగిస్తుంది. అంతకాక అనేక వ్యాధులు పెరిగే ప్రమాదం కూడా తలెత్తుతుంది.
Follow us on

చలి కాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఇందులో భాగంగా గుడ్డు తినాలని నిపుణులు సూచిస్తుంటారు. గుడ్లలో చాలా రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. రోజుకు రెండు గుడ్లు కూడా ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. గుడ్లు రోజూ తినడం వల్ల శరీరంలో అంతర్గతంగా వేడి పెరుగుతుంది. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎముకల్ని పటిష్టం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువైతే అమృతం కూడా విషమవుతుంది..అనే సామెత మీరు వినే ఉంటారు. గుడ్లు కూడా అంతే.. గుడ్లు మితంగా తినడం మంచిది. ఎక్కువ గుడ్లు తినడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. అధిక విరేచనాలతో శరీరం బలహీనంగా మారిపోయి.. అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది.

గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుందని మీకు తెలుసా? ఈ సూక్ష్మక్రిములు మీ శరీరంలోకి ప్రవేశించి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇది చికెన్ నుండి వస్తుంది. గుడ్లను సరిగ్గా ఉడకబెట్టకపోతే ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

రోజువారీ సూచించిన 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌లో సగానికి పైగా ఒకే గుడ్డులో ఉంటుంది.. అందువల్ల, రోజుకు ఎక్కువ మొత్తంలో గుడ్లు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎక్కువ గుడ్లు తిన్నప్పుడు మీ శరీరం వినియోగించే కేలరీలను సమతుల్యం చేయదు. దీని కారణంగా మీరు బరువు పెరగడం ప్రారంభిస్తారు. మీరు ఎక్కువ గుడ్లు తీసుకుంటే అది నేరుగా మీ బరువును ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పచ్చసొన పూర్తిగా కొలెస్ట్రాల్‌తో నిండివుంటుంది. అయితే గుడ్డులోని తెల్లసొన పూర్తిగా ప్రోటీన్‌లతో తయారవుతుంది. అందువల్ల, మీరు ఉడికించిన గుడ్లు తిన్నప్పటికీ కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది.

మీరు ఎక్కువ గుడ్లు తింటే, మీ జీర్ణవ్యవస్థ దెబ్బతినవచ్చు. మీకు విపరీతమైన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.. కొన్ని సందర్భాల్లో కడుపు చికాకు, గ్యాస్ సమస్యల ప్రమాదం కూడా ఉండవచ్చు.

గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గుడ్డులో ఉండే అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో చక్కెర పరిమాణం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. షుగర్ నియంత్రణలో లేకపోతే.. మధుమేహం బారినపడక తప్పదు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.