I-Pill: గర్భ నివారణకు ఐ పిల్ తరచూ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే

|

Aug 16, 2022 | 6:26 PM

I-Pill Tablet: ఈ రోజుల్లో చాలా మంది గర్భం రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది యువతులు గర్భం రాకుండా ఉండాలంటే కొన్ని పద్దతులను..

I-Pill: గర్భ నివారణకు ఐ పిల్ తరచూ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే
I Pill
Follow us on

I-Pill Tablet: ఈ రోజుల్లో చాలా మంది గర్భం రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. చాలా మంది యువతులు గర్భం రాకుండా ఉండాలంటే కొన్ని పద్దతులను అనుసరిస్తున్నారు. వాటిలో కండోమ్స్‌, పిల్స్‌ లాంటివి ఎక్కువగా వాడుతుంటారు. అయితే కండోమ్స్‌ వాడటం వల్ల కొన్ని ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చాలా మంది భావిస్తుంటారు. ఇక పిల్స్‌ కొందరిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోయినా కొందరిలో సమస్యలు వస్తాయి. ఐ పిల్స్‌ వాడే వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే శృంగారంలో పాల్గొన్న 24 గంటల్లోపు వేసుకుంటే ఫలితాలు ఉంటాయి. ఈ పిల్స్‌లో లెవెనోర్‌జెస్ట్రల్‌ అనే హార్మోన్‌ ఉంటుంది.

ఇవి వాడటం వల్ల అధిక బరువు పెరగడం, వ్యంధ్యత్వానికి కారహనవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ పిల్స్‌ వాడటం వల్ల కొందరిలో వాంతులు, వికారం, అలసట, కడుపునొప్పి, గ్యాస్ట్రో సమస్య, విరేచనాలు, మైకము, తలనొప్పి, రొమ్ము నొప్పి వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఇవే కాకుండా రుతుక్రమం ఆలస్యంగా రావడం, పీరియడ్స్‌ సమయంలో అధిక రక్తస్రావం అవకాశాలున్నాయి.

ఈ పిల్స్ ఎన్ని సార్లు వేసుకోవచ్చు..

ఇవి కూడా చదవండి

అయితే లైంగిక సంపర్కం జరిగిన 24 గంటలలోపు తీసుకుంటే 95 శాతం దీని ప్రభావం ఉంటుంది. 25-48 గంటల్లోపు తీసుకుంటే 85 శాతం, 49-72 గంటల్లోపు తీసుకుంటే 58 వాతం మాత్రమే ఉంటుందంటున్నారు. అదే 72 గంటల తర్వాత పిల్స్‌ తీసుకుంటే ఎలాంటి ప్రభావం ఉండదంటున్నారు. ఇవి నెలలో రెండు సార్లకంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించకూడదంటున్నారు. ఇది ఓరల్‌ టాబ్లెట్‌. ఇది నీటితో, కొంత ఆహారం తీన్న తర్వాత తీసుకోవాలి.

దీని సైడ్ ఎఫెక్ట్స్ అందరిలో ఉంటుందా..?

అప్పుడు 95 శాతం వరకు ప్రభావంతంగా ఉంటుంది. ఐ-పిల్‌ అనేది 25-45 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు అనుకూలంగా ఉంటుంది. యుక్తవయస్కులకు ఇది పునరుత్పత్తి వ్యవస్థపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. రెగ్యులర్‌ వాడకం వల్ల రుతుక్రమ సమస్యలకు దారి తీస్తుందని, అండాశయాలను కూడా దెబ్బతిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భంతో ఉన్న మహిళలు ఈ మాత్రలను అస్సులు తీసుకోవద్దు. ఎలర్జీ ఉన్న వాళ్లు కూడా వీటిని తీసుకోకపోవడం మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఈ సమస్యలన్ని అందరిలో ఉండవు. కొందరిలో మాత్రమే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని గుర్తించుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి