
కుంకుమ పువ్వు వంటకాల రుచిని పెంచుతుందనే విషయం చాలామందికి తెలుసు.. కొన్ని ప్రత్యేక వంటకాల్లో దీనిని ఉపయోగిస్తారు. అలాగే వంటకాల రుచిని ఎలా పెంచుతుందో.. అలాగే మనిషి యొక్క అందాన్ని కూడా పెంచుతుంది. కాలానుగుణంగా చర్మ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కొన్ని సింపుల్ టిప్స్‌తో మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ సౌందర్యం కోసం ఎక్కువ ఖర్చు పెట్టి రకరకాల క్రీములు రాసే బదులు.. కొన్ని సహజ ఫేస్ ప్యాక్‌లను తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. చర్మ సంరక్షణకు ఉపయోగించే పదార్ధాలలో కుంకుమ పువ్వు, కేసర్ అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్ధం. ఈ కుంకుమ పువ్వుని అనేకరకాల ప్రాడక్ట్స్ లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు ఒకరకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము కూడా. ఈ భూభాగంలో అత్యంత ఆకర్ణీయమైనది, ఖరీదైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమపువ్వు. కుంకుమపువ్వు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
కుంకుమపువ్వుతో చర్మానికి అనేక రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. అందులో ఇలా చేసుకోవడం వల్ల నిగారింపైన ముఖవర్చస్సు కావాలంటే ఇలా ట్రై చేయండి. అది కూడా పచ్చి పాలు, కుంకుమపువ్వు – కుంకుమపువ్వును పచ్చి పాలలో కొంత సమయం పాటు నానబెట్టండి. ఇది చర్మానికి సహజమైన క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. కుంకుమపువ్వు పాలలో దూదిని ముంచి, దానితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. కుంకుమపువ్వును గంధం, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి వేసుకుంటే సహజమైన మెరుపు వస్తుంది. ఒక చెంచా చందనం పొడిలో 4 నుంచి 5 దారాల కుంకుమపువ్వు వేసి కలపాలి. రోజ్ వాటర్ ఉపయోగించి మందపాటి పేస్ట్ చేసుకోవాలి. మీ ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కుంకుమపువ్వును కూడా ఉపయోగించవచ్చు. బ్రౌన్ షుగర్, కొబ్బరి నూనెతో కలిపిన కుంకుమపువ్వును బాడీ స్క్రబ్‌గా ఉపయోగించండి. మీ చర్మం నుండి చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి మీ చేతులతో ఈ మిశ్రమాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. చర్మాన్ని హైడ్రేట్ గా , తాజాగా ఉంచడానికి మీరు దీన్ని టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. సువాసనగల టోనర్‌ను తయారు చేయడానికి కొన్ని కుంకుమపువ్వును రోజ్ వాటర్‌లో నానబెట్టాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత.. దానిని స్ప్రే బాటిల్‌లో వేసి ముఖంపై స్ప్రే చేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..