Honey Beauty Tips: సహజంగా తయారయ్యే తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేనెతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కరోనా కాలంలో తేనెను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తేనె కేవలం ఆరోగ్యానికే మేలు చేయడమే కాకుండా ముఖారవిందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? కొన్ని చిన్న చిన్న చిట్కాలతో మీ ముఖాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ఆ చిట్కాలపై ఓ లుక్కేయండి..
* చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడంలో తేనె ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం బాదం పొడితో తేనెను మిశ్రంగా చేసి ముఖంపై రాసుకోవాలి. ఇలా చేసిన కొంత సేపటి తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే.. ముఖంపై ఉన్న మృత కణాలు కోల్పోయి, చర్మానికి తేమ లభిస్తుంది.
* మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? అయితే తేనె మీకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. తేనె, ఆలివ్ నూనెలను కలిపి మిశ్రంగా చేసి ముఖాన్ని రాసుకోవాలి.. అనంతరం కొద్ది సమయం త్వారత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
* మజ్జిగ, తేనె, గుడ్డు పచ్చ సొనను మిశ్రంగా చేసి ముఖానికి మర్దన చేయాలి. అనంతరం 20 నిమిషాల కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
* తేనెను ముఖానికి రాసుకొని కొంత సమయం తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు.. ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలు తగ్గిన తర్వాత ఏర్పడే మచ్చలు సైతం తేనెతో చెక్ పెట్టవచ్చు.
Monsoon Recipes: వర్షాకాలంలో ఈ బెస్ట్ స్నాక్స్ సులభంగా ఇంట్లోనే చేసుకోని ఎంజాయ్ చేయండి..