Stomach Pain: కడుపునొప్పి బాధపడుతున్నారా..? ఇది వాడి చూడండి.. మందుల అవసరమే ఉండదు..

|

Apr 05, 2022 | 7:50 AM

Home Remedies for Stomach Ache: ప్రస్తుతకాలంలో తీసుకునే ఆహారం.. జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాంటి అనారోగ్య సమస్యల్లో కడుపు నొప్పి కూడా ఒకటి.

Stomach Pain: కడుపునొప్పి బాధపడుతున్నారా..? ఇది వాడి చూడండి.. మందుల అవసరమే ఉండదు..
Stomach Pain
Follow us on

Home Remedies for Stomach Ache: ప్రస్తుతకాలంలో తీసుకునే ఆహారం.. జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాంటి అనారోగ్య సమస్యల్లో కడుపు నొప్పి కూడా ఒకటి. కడుపు నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఈ సమస్యకు బలమైన చికిత్స అవసరం. అలాంటి కడుపునొప్పికి హోమ్ రెమిడిస్ ద్వారా చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెసిపీ ఆయుర్వేదంలో కూడా ఉంది. ఇది కొన్ని నిమిషాల్లో కడుపు నొప్పి సమస్యను తొలగిస్తుంది. అదే వాము (Carom Seeds Benefits) రెసెపీ. సాధారణంగా వాము అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనితో కడుపు నొప్పి సమస్యను అధిగమించవచ్చు. దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా పూర్తిగా సురక్షితమైనవి కూడా అని నిపుణులు పేర్కొంటున్నారు. మందులను వాడకుండా వాముతో కడుపు నొప్పికి ఎలా చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపునొప్పికి వాముతో చెక్..

సాధారణంగా అజీర్తి, మలబద్దకం, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం, ఎసిడిటీ పలు అనారోగ్య సమస్యల వల్ల కడుపులో నొప్పి వస్తుంది. కడుపు నొప్పికి సరైన కారణం అంటూ మనం గుర్తించలేం. ఈ క్రమంలో వాము గింజలను తీసుకొని తినడం మంచిది. మంటగా అనిపించిన తిన్న వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే.. మీరు వామును నమలడం, తినలేకపోతే, నీటితో కూడా తీసుకోవచ్చు.

కడుపునొప్పితోపాుట ఒంటినొప్పులు ఉంటే మీరు నీటిలో వాము గింజలను వేసి మరిగించి తాగాలి. దీంతో త్వరగా ఉపశమనం పొందవచ్చు.

కడుపునొప్పి ఉన్నట్లయితే నాభిలో అసిఫెటిడాను పూయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. దీని కోసం కొద్దిగా ఇంగువ తీసుకుని, కొన్ని చుక్కల నీటిలో కలిపాలి. ఆ తర్వాత దూదితో ఇంగువను తీసుకొని నాభిలో పూయాలి. ఈ రెసిపీ కూడా త్వరగా ఉపశమనం ఇస్తుంది.

కడుపు నొప్పి – వికారం

కడుపు నొప్పితో పాటు వికారం సమస్య ఉంటే, ఈ పరిస్థితిలో వాము గింజలతో పాటు నల్ల ఉప్పును కలిపి తినాలి. కొన్ని నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది.

ఛాతీలో మంట..

కారంగా లేదా వేయించిన ఆహారాన్ని తిన్న తర్వాత, ఛాతీపై మంట సమస్య ఉంటే వాము గింజలతోపాటు ఒక బాదం గింజను నమలి తినాలి. దీని ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు.

పాలు, పిండి, స్వీట్లతో సమస్య ఉంటే..

కొంతమందిలో జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొన్ని పదార్థాలు తిన్న వెంటనే పలు సమస్యలు వస్తుంటాయి. వీటిలో పిండి పదార్థాలు, పాలు, ఏదైనా స్వీట్లు వంటివి ఉన్నాయి. ఇలాంటి ఆహారం తిన్న తర్వాత కడుపు నొప్పి, అజీర్ణం, వికారం లాంటి సమస్య ఉంటే వాము తినడం మంచిది.

(ఈ కథనం కేవలం సమచారం కోసం మాత్రమే.. నిపుణులను సంప్రదించిన తర్వాత ఈ చిట్కాలను పాటించండి. )

Also Read:

Guntur: చోరీ కోసం పక్కా ప్లాన్‌ వేశాడు.. కళ్లల్లో కారం కొట్టాడు.. చివరకు అలా దొరికిపోయాడు!

Prison Riot: మరోసారి రక్తమోడిన ఈక్వెడార్ జైలు.. తుపాకులు, కత్తులతో దాడులు.. 20మంది మృతి!