Home Remedies: వేడిగా ఉన్న పదార్థాలు తిన్నా, తాగినా చాలా మందికి కాలుక కాలుతుంది. వేడి ప్రభావంతో నాలుగు మండిపోతుంది. అలాంటి సమయంలో నాలుగకపై విపరీతమైన మంట ఉంటుంది. మరేదైనా తినాలంటే కూడా జంకుతుంటారు. ఇలాంటివి చాలా మందికి జరుగుతుంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి టెన్షన్ పడకండి. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే కాలిన నాలుక మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఐస్ క్రీం :
వేడివేడిగా ఏదైనా తిన్న వెంటనే మీ నాలుక కాలితే అలాంటి సమయంలో ఐస్ క్రీం తినడం మంచిది. ఇది మీ నాలుక వాపును తగ్గిస్తుంది. నాలుక మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.
తేనె :
తేనె మీ నాలుక చికాకును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 1 టీస్పూన్ తేనెను మీ నోటిలో తీసుకుని కాసేపు అలాగే ఉంచుకోండి. త్వరగా ఉపశమనం పొందడానికి తేనె ఉపయోగపడుతుంది. మీరు తేనెను రోజుకు 2 నుండి 4 సార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నాలుక మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.
చూయింగ్ గమ్:
మీరు నాలుక మండే అనుభూతిని తొలగించడానికి పిప్పరమెంటుతో చూయింగ్ గమ్ తీసుకోవచ్చు. ఇది నోటిలో లాలాజలం మరింతగా ఏర్పడి మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.
పెరుగు:
నాలుగ మంట నొప్పిని తగ్గించడానికి పెరుగు ఉత్తమమైనది. మీ నాలుక మండిన వెంటనే మీరు పెరుగు తినాలి. పెరుగు చల్లగా ఉండటం వల్ల ఈ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. పెరుగు నోటిలో కాసేపు అలాగే ఉండనివ్వండి. ఇది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి